Begin typing your search above and press return to search.

సింగ‌రాయ్ నుంచి #సిరివెన్నెల లిరికల్ సాంగ్‌

By:  Tupaki Desk   |   6 Dec 2021 7:33 AM GMT
సింగ‌రాయ్ నుంచి #సిరివెన్నెల లిరికల్ సాంగ్‌
X
నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం శ్యామ్ సింగ‌రాయ్. ఈ చిత్రంలో సాయి పల్ల‌వి- కృతి శెట్టి లాంటి ట్యాలెంటెడ్ మ‌ల్లూగాళ్స్ నాయిక‌లు. నిహారిక‌ టైన్ మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. డిసెంబ‌ర్ 24న‌ శ్యామ్ సింగ‌రాయ్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తున్నాడు.

ఈ మంగ‌ళ‌వారం విడుద‌ల కానున్న లిరిక‌ల్ సాంగ్ ..#సిరివెన్నెల లిరికల్ సాంగ్‌.. కాస్మిక్ ప్రేమ ప్రసరిస్తుంది.. విడుద‌ల కానుంది. కీ.శే.సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాట‌కు సాహిత్యం అందించ‌డం విశేషం. మిక్కీ జే మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రాహుల్ సాంకృత్య‌న్ సంగీతం అందించారు.

ఇటీవ‌ల విడుద‌లైన సింగ‌రాయ్ ప్రోమోకి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఇందులో నాని లుక్ ఆద్యంతం ఆస‌క్తిని క‌లిగించింది. మీసం మెలేసి.. క‌నుబొమ‌లు ఎగ‌రేస్తూ రోష‌గాడిలా క‌నిపించాడు నాని. అత‌డికి మ‌గువ‌ల్లో ఫాలోయింగ్ బావుంది. ఆటోగ్రాప్ లు ఇస్తున్నాడు. అంతేకాదు.. కొంచెం పెద్ద మ‌నిషి త‌ర‌హాగా క‌నిపిస్తున్నాడు.. అత‌డిని చూస్తే జ‌నం వంగి వంగి స‌లాం కొడుతున్నారు.

ఓవ‌రాల్ గా ప్రోమో నాని ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రోమో ఆద్యంతం సింగ‌రాయ్ ఎలివేష‌న్ పీక్స్ లో వ‌ర్క‌వుటైంది. నాని లుక్ గెట‌ప్ ఆహార్యం ప్ర‌తిదీ మారిపోయింది. కొత్త లుక్ తో నాని మ్యాజిక్ వ‌ర్క‌వుట‌వుతుంద‌నే అంతా భావిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి న‌ట‌న.. కృతి అంద‌చందాలు సింగ‌రాయ్ కి అద‌న‌పు బ‌లంగా నిలుస్తాయ‌న‌డంలో సందేహం లేదు.