Begin typing your search above and press return to search.
నింగికేగిన సిరివెన్నెలకు సినీ లోకం నివాళి..!
By: Tupaki Desk | 1 Dec 2021 3:40 AM GMTప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న దిగ్గజ లిరిసిస్ట్.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
* సీతారామశాస్త్రి మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. నేను ఇది నమ్మలేకున్నా. బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు కుడి భుజాన్ని కోల్పోయాను. ఇప్పుడు నా ఎడమ భుజాన్ని కోల్పోయా. ఏం చేయాలో.. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఎంతో సన్నిహితంగా ఉండే సిరివెన్నెల మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే నమ్మశక్యంకావడంలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను - దర్శకుడు కె. విశ్వనాథ్.
* సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆస్పత్రిలో చేరకముందు ఆయనతో మాట్లాడాను. తన ఆరోగ్య పరిస్థితి తెలిసి మద్రాసులో నాకు తెలిసిన ఓ హాస్పిటల్కు వెళ్ధామని చెప్పా. ‘ప్రస్తుతానికి ఇక్కడ జాయిన్ అవుతా ఉపశమనం పొందకపోతే నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం’ అన్నారు. అలా వెళ్లిన మనిషి ఇలా జీవం లేకుండా వస్తారని ఊహించలేకపోయా. వేటూరిగారి తర్వాత అంత గొప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన భాషను అర్థం చేసుకోవడానికి మనకున్న పరిజ్ఞానం సరిపోదు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించిన రోజు నేను ఆయన ఇంట్లో చాలాసేపు గడిపాను. ఓ ఆత్మీయుడ్ని కోల్పోయా. గుండె బరువెక్కిపోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. నా ‘రుద్రవీణ’ చిత్రంలో ‘తరలిరాద తనే వసంతం.. తన దరికిరాని వనాల కోసం’ అంటూ ఓ పాట రాశారు. ఇప్పుడు ఆయన మనందర్నీ వదిలి వెళ్లిపోయారు. భౌతికంగా ఆయన దూరమైనా తన పాటలతో బతికే ఉన్నారు - చిరంజీవి.
* చిరస్థాయిగా నిలిచిపోయే అందమైన పదాలు పాటలను మిగిల్చి మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు సీతారామ శాస్త్రి గారూ!! మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను - అక్కినేని నాగార్జున
* సినీ పాటకు సాహితీ గౌరవం కల్పించిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు పాటను దశదిశలా వ్యాపింపజేసిన ఘనత సిరివెన్నెలకే దక్కుతుంది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా - నందమూరి బాలకృష్ణ.
* సిరివెన్నెల సీతారామశాస్త్రి నా సన్నిహితుడు. సరస్వతీ పుత్రుడు. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి - మంచు మోహన్ బాబు.
* సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరనే వార్త విని చాలా బాధేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను - వెంకటేష్ దగ్గుబాటి
* సాహిత్య మేధావి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు మరియు ప్రార్థనలు కుటుంబంతో ఉన్నాయి. ప్రశాంతంగా ఉండండి సార్.. మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం - మహేష్ బాబు
* సిరివెన్నెల సీతారామశాస్త్రి అక్షర తపస్వీ. తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు. సిరివెన్నెల మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి - పవన్ కళ్యాణ్
* సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా.., రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను - జూనియర్ ఎన్టీఆర్
* సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లేరంటే చాలా బాధగా ఉంది. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి ప్రార్థిస్తున్నాను - రవితేజ
* సిరివెన్నెల గారి మరణవార్త తెలిసి దిగ్భ్రాంతి, బాధ కలిగింది. ఆర్.ఆర్.ఆర్ - సైరా కోసం ఆయన చేసిన విలువైన పాటలు నా జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోతాయి. సాహిత్యానికి, తెలుగు సినిమాకి ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి - రామ్ చరణ్
* నా టీనేజ్ లైఫ్ మొత్తాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వ్యాఖ్యలు నన్ను ప్రభావితం చేశాయి. నాలాంటి చాలామందిని ఇన్స్పైర్ చేసేలా ఎన్నో పాటలు రాసారు. ఈ రోజు ఆయన మరణ వార్త నా మనసుని కలచివేసింది. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగానే కాక తెలుగు సినీ, సాహితీ లోకానికి తీరని లోటు. ఈ విషాద సమయంలో నా తరుపున 'మా' అసోసియేషన్ తరుపున వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను - మంచు విష్ణు
* జగమంత కుటుంబం మీది మీరు లేక ఏకాకి జీవితం మాది. భరించలేకున్నాం. మీ కవితా భావనలతో మా జీవితాలకు అర్థాలను జోడించిన మీకు ధన్యవాదాలు. మీరెంతో ఉత్తములు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి - ప్రకాష్ రాజ్
* సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తున్నాను - నందమూరి కల్యాణ్ రామ్
* సిరివెన్నెల గారితో కలిపిన మాటలు ఎప్పటికీ మరిచిపోలేను. ఎప్పటికీ గొప్ప వారైన సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మీ లెగసీ మిమ్మల్ని ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది సార్. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మిమ్మల్ని మిస్ అవుతున్నాం - అఖిల్ అక్కినేని
* కవిత్వం పట్ల మక్కువను పంచుకుంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మరియు రవి కిషోర్ గారు 35 సంవత్సరాల నుండి చాలా సన్నిహిత మిత్రులు. మాకు కలిగిన నష్టాన్ని వర్ణించలేము. అద్భుతమైన గీత రచయిత, అద్భుతమైన వ్యక్తి మరియు నిజంగా గొప్ప స్నేహితుడు. తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన అసమానమైన సహకారానికి సీతారామశాస్త్రి గారికి ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మీతో కలిసి పనిచేయడం గొప్ప విషయం. ప్రశాంతంగా ఉండండి సార్ - రామ్ పోతినేని
* మీ మాటలు, పాటలు విని కొన్ని దశాబ్దాలుగా ఎంతో ఆనందించాము. కానీ ఈ సమయంలో మీ గురించి ఎలా రాయాలో తెలియటం లేదు సార్. కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి.. మీ కళ ద్వారా మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు సార్. లెజెండ్స్ జీవించే ఉంటారు - సుశాంత్
* తెలుగు సాహిత్య శిఖరం.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. అజ్ఞానపు చీకటిని తన అక్షర కిరణాలతో వెన్నెలగా మార్చిన సిరివెన్నెల గారికి.. కన్నీటి వీడ్కోలు - అనిల్ రావిపూడి
* మీ పాటలే మేము నేర్చుకున్న పాఠాలు.. మీ సూక్తులు మేము రాసుకొనే మాటలు.. బ్రహ్మ ఒక్కడే కష్టపడుతున్నాడు అని సాయంగా ఇంత తొందరగా వెళ్లిపోయారా? నా పాట పూర్తి చేసి వెళ్లిపోయారు కానీ పాఠం మధ్యలోనే వదిలేసారు గురూజీ.. భరించలేని నిజం చెవులు వింటున్నాయి. కానీ మనసు ఒప్పుకోవటం లేదు - మారుతి
* 'మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది.. ఎవరో ఒకరు ఎపుడో అపుడు.. నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు.. అటో ఇటో ఎటో వైపు' - మహానుభావా.. చిరస్మరణీయుడా.. ఇక కనిపించవా?.. మా గుండెల్లో నిద్రపోయావా?.. విశ్వాత్మలో కలిసిపోయావా? - దేవ కట్టా
* మన తెలుగు భాష సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కోల్పోయింది. కలంతో, కాగితంతో అయన చేసిన స్నేహం అమరం. మహాకవికి కన్నీటి వీడ్కోలు - మెహర్ రమేష్
* సీతారామశాస్త్రిగారు తెలుగు సినిమాకు గొప్ప వరం. ఆయన లేకపోవడం ఏమిటి? అనిపిస్తోంది. ఎస్పీ బాలుగారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా... ఆయన్ను గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటున్నాం. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగారు కూడా అంతే! ఎప్పటికీ మన గుండెల్లో ఉండిపోతారు. నేను దర్శకత్వ శాఖలో పని చేసినప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఉంది. చాలా ఆత్మీయంగా పలకరించేవారు. 'చెన్నకేశవరెడ్డి'లో ఆయనతో పాటలు రాయించుకున్నాను. నా 'అదుర్స్' సినిమాలో కామెడీని ఆయన ఎంజాయ్ చేసేవారు. ఆయనతో గడిపిన క్షణాలను ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటాను - వీవీ వినాయక్.
* "ఏకపాత్రాభినయం ఆగిపోనుందా.." అంటూ ఒకసారి ఆయన ఏకాంతంలో అప్పుడే రాసుకున్న ఒక పాట నాకోసం పాడారు. అది ఆయన స్వగతం అని అని నాకు అనిపించినా అప్పుడు కవిత్వంలో మునిగి "వారేవా" అన్నాను. ఇప్పుడు అదే పాట ఆయన స్వరంలో నా గుండెల్లో మోగుతూ పిండేస్తోంది - సిరాశ్రీ
* చుక్కల్లారా.. చూపుల్లారా.. ఎక్కడమ్మా జాబిలి? - కీరవాణి
* ఇంకెక్కడి వెన్నెల తెలుగు పాటకు అమావాస్య - హరీష్ శంకర్