Begin typing your search above and press return to search.

ప‌ద్మ‌శ్రీ ఇవ్వండి అని బ‌తిమాల‌లేదు- సిరివెన్నెల‌

By:  Tupaki Desk   |   1 Feb 2019 4:06 AM GMT
ప‌ద్మ‌శ్రీ ఇవ్వండి అని బ‌తిమాల‌లేదు- సిరివెన్నెల‌
X
జీవితం ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌దు.. ప‌రిశ్ర‌మ‌కు ఎంతో మంది వ‌స్తారు వెళుతుంటారు .. స‌ర్ధుబాటు త‌నం ఇక్క‌డ‌ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. అలానే ప‌ని చేశాన‌ని అన్నారు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. ఇంత‌కాలానికి త‌న‌కు ప‌ద్మ‌శ్రీ వ‌చ్చినందుకు ఎంతో స‌ర్‌ ప్రైజ్ అయ్యాన‌ని అన్న శాస్త్రి గారు.. ప‌ద్మ‌శ్రీ ఇవ్వండి అని బ‌తిమాలుకోలేద‌ని అన్నారు. సినీ సాహిత్యమనే వ్యవసాయంలో తనకు లభించిన ఫలసాయం పద్మశ్రీ. ఈ పురస్కారానికి తన పేరు సూచించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ హోట‌ల్లో పాత్రికేయ మిత్రుల కోసం ఏర్పాటు చేసిన ధ‌న్య‌వాద కార్య‌క్ర‌మంలో సిరివెన్నెల పైవిధంగా స్పందించారు. ఈ సంద‌ర్భంగా సినీ మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సీనియ‌ర్ లిరిసిస్ట్ త‌న‌దైన శైలిలో స్పందించారు.

సినీక‌వి అంటే నేతి బీర‌కాయ అని అనుకునేవారు ఇంత‌కుముందు.. అప్ప‌ట్లో జాలిగా చూస్తుండేవారు.. కానీ సినిమా క‌వే గొప్ప క‌వి. మామూలు క‌వి మూడొస్తే రాసుకుంటాడు. జోల పాట‌లు రాసుకుంటాడు. కానీ సినిమా పాట అలా కాదు. మూడ్ తెచ్చుకుని రాయాలి. సినిమా క‌విలో ఉండ‌గ‌ల‌గ‌డం ధన్య‌మ‌వ్వ‌డ‌మేన‌ని రాసాను. ఏ సంద‌ర్భం వ‌చ్చినా స్పందించి రాసే గుణం ఉండాలి... అని అన్నారు. నేటి ట్రెండ్ లో పాట తీరుతెన్నుల్ని వివ‌రిస్తూ... ఈ మ‌ధ్య హిట్ట‌యిన సినిమాల్లో అస్స‌లు పాట గుర్తు ఉండ‌టం లేదు. అలాంటివి ఎందుకు తెర‌కెక్కిస్తారో.. నిర్మాత‌లు ఆ ఖ‌ర్చు మిగిలించుకోవ‌చ్చు క‌దా? గుర్తుండ‌నివి ఎందుకు తెర‌కెక్కించ‌డం? అని సిరివెన్నెల అన్నారు. రాయించుకున్న చ‌ర‌ణం - ప‌ల్ల‌వుల్లో ఒక‌టి మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నారు. కూచుని ఆలోచించే స్థిమిత‌మే లేదు ఎవ‌రికీ అని విమ‌ర్శించారు.

తనకు పద్మశ్రీ రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆకాంక్షించ‌డం ఆనందం క‌లిగించింద‌ని అన్నారు. పాట‌ల ప్ర‌స్థానంలో త‌ర‌చి చూస్తే... పదాల కూర్పు - రచయితల శైలి మారినప్పుడే సినీరంగంలో చక్కటి పాటలు వస్తాయని సూచించారు. కేంద్రం తనకు పద్మశ్రీ పురస్కారాన్ని మాత్రమే ప్రకటించింది. బిరుదును పేరు ముందు రాయ‌కూడ‌దు. అలా రాయొద్దు అని అన్నారు.