Begin typing your search above and press return to search.
సీతారామశాస్త్రి రాత ఎలా ఉంటుంది?
By: Tupaki Desk | 14 Nov 2015 9:30 AM GMTసీతారామశాస్త్రి రాత ఎలా ఉంటుందో ఆయన అభిమానులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మూడు దశాబ్దాల కిందట విదాత తలపున ప్రభవించినది.. అంటూ తెలుగు సినీ సాహిత్యాన్ని ఎన్నో మెట్లు ఎక్కించిన ఈ లివింగ్ లెజెండ్.. ఇన్నేళ్లలో ఎన్నో అత్యద్భుతమైన పాటల్ని అందించారు. సీతారామశాస్త్రి పాటలు రాశాడంటే ఆ సినిమాకు ఓ స్థాయి ఉంటుందన్న అంచనాతో థియేటరుకు వెళ్లే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారంటే తన పాటల ద్వారా ఆయన ఎంత గౌరవం సంపాదించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఐతే సీతారామశాస్త్రి ఎలా రాస్తారో తెలుసు కానీ.. ఆయన రాత ఎలా ఉంటుందో మాత్రం మనకు తెలియదు. ఆ రాత చూసే అవకాశాన్ని కల్పించాడు డైరెక్టర్ క్రిష్.
క్రిష్ కొత్త సినిమా ‘కంచె’ కోసం సీతారామశాస్త్రి ‘విధ్వేషం పాలించే దేశం ఉంటుందా.. విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా..’ అనే పల్లవితో సాగే అద్భుతమైన పాట రాసిన సంగతి తెలిసిందే. ఆ పాట రాసిన కాగితాన్ని ఈ రోజు ట్విట్టర్ లో షేర్ చేశాడు క్రిష్. ఈ పాటను సీతారామశాస్త్రి సెప్టెంబరు 9న రాసివ్వడం విశేషం. ఆ నెల 17న ఆడియో విడుదలైంది. ఈ పాట కోసమే ఎన్ని నెలలైనా సినిమాను వాయిదా వేసుకుందామని ఎదురు చూశామని.. ఆడియో విడుదల కూడా ఈ పాట కోసమే వాయిదా పడిందని క్రిష్ ఆడియో ఫంక్షన్లో చెప్పిన సంగతి తెలిసిందే. 9న పాట రాసిస్తే.. దాన్ని రికార్డ్ చేసి 8 రోజులకే ఆడియో విడుదల చేశారన్నమాట.