Begin typing your search above and press return to search.
కథంతా ఇలా చెప్పేస్తే ఎలా సారూ?
By: Tupaki Desk | 2 Oct 2018 3:36 PM GMTసినిమా రిలీజ్ ముందే కథ లీకైతే ఉత్కంఠ ఉంటుందా? అయితే అసలే తెలియకపోతే ఏమీ ఉండదు కదా! అనుకున్నారేమో .. సీనియర్ లిరిసిస్ట్ - త్రివిక్రముని ఆస్థాన రచయిత సీతారామ శాస్త్రి గారు అరవింద సమేత కథ మొత్తం లీక్ చేశారు. ఉత్సాహంలోనో లేక ఉల్లాసంగానో మొత్తానికి కథైతే చెప్పేశారు.
నాకు ఒక నిమిషమే టైమ్ ఇవ్వండి. ఈ నిమిషం ఎన్టీఆర్ గురించి చెప్పాల్సి ఉంది. అంటూనే అరవింద కథంతా శాస్త్రి గారు చెప్పేశారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రను ఎంచుకున్నారు. త్రివిక్రమ్ ఒక అద్వితీయమైన అసాధారణ మైన కథ ఎంపిక చేసుకున్నారు. ఆ కథేంటో చెప్పను... అంటూనే కథంతా చెప్పేశారు.
ఇవాళ మన సమాజంలో ఉన్న పరిస్థితులు... అలజడులు.. అల్ల కల్లోలాలు అన్నీ కూడా పగలు.. పంతాలు.. పట్టింపులు.. కక్షలు.. కత్తులు వీటి పట్ల ఉన్న మక్కువ .. అది కాక ప్రేమలు.. పరువులు.. కులాలు కూడా జీవితాన్ని అంతం చేయడానికి ఇష్టపడుతూ చావునే గ్లామరైజ్ చేస్తున్న సందర్భంలో జీవించడం ఒక బాధ్యత ఒక అందమైన వరం అని చెబుతుంది ఎన్టీఆర్ పాత్ర. చావడాన్ని గ్లామరైజ్ చేస్తున్న వర్తమానం నుంచి బతకడాన్ని గ్లామరైజ్ చేయడం ఎలాగ.. ఆయుధం అక్కర్లేకుండా బతకడం ఎలాగో సహనంతో ప్రేమతో.. క్షమతో ఉండాలి.. ఈ మూడు పనులు చేయాలంటే ఒక వీరుడు కావాలి. క్షమించాలి అంటే బలం ఉన్నవాడే చేయాలి. దెబ్బ కొట్టాలంటే వీరుడు మాత్రమే చేయగలడు.. అలా ఓర్పు .. జీవితం పట్ల అక్కర - ఓర్పు ఉన్న పాత్రలో నటించాడు ఎన్టీఆర్. ఒక చట్రంలో ఇమిడి పోకుండా అవసరం అయితే మెరుపు తీగలాగా నృత్యం చేయగలిగే తను జలపాతంలా నర్తించే తను.. అవసరం అయితే .. ప్రశాంతంగా కనిపించగలడు.. అదే అరవింద సమేత సినిమా .. అని చెప్పేశారు. తాత గారు.. పిచ్చి పుల్లయ్య - తోడు దొంగలు - భీష్మ - రాజు - పేద లాంటి డీగ్లామరైజ్డ్ పాత్రలు చేశారు. పెద్దాయన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎలా అయ్యాడో అంతటి శక్తి ఉన్న ఎన్టీఆర్ తన అభినయ విస్త్రతిని చూపించాలని ఆశపడుతూ వస్తున్నాడు.. మీ అభిమానాన్ని అతడికి చట్రంగా వేయకండి అంటూ అభిమానులకు క్లాస్ తీస్కున్నారు శాస్త్రీజీ. మొత్తానికి వీరరాఘవుని పాత్రను - కథను ఆయన తనదైన శైలిలో చెప్పేశారన్నమాట!!