Begin typing your search above and press return to search.
ఛార్మి ప్రశ్నలు అప్పుడే బయటకు వచ్చేశాయ్
By: Tupaki Desk | 26 July 2017 5:59 AM GMTతీవ్ర సంచలనంగా మారిన డ్రగ్స్ విచారణ ఉదంతంలో ఈ రోజు ప్రముఖ నటి ఛార్మిని సిట్ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. కోర్టు చెప్పిన సమయానికి దాదాపు పావు గంట ముందే వచ్చిన ఛార్మిని.. ముందుగా నిర్ణయించిన సమయానికే విచారణను మొదలు పెట్టారు అధికారులు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివకే డ్రగ్స్ విచారణకు హాజరైన సినీ ప్రముఖులకు సంధించిన ప్రశ్నావళి గంటల తర్వాత కానీ బయటకు రాలేదు. కానీ.. ఛార్మి విషయంలో మాత్రం విచారణ మొదలైన 40 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే బయటకు రావటం ఆసక్తికరంగా మారింది.
ఛార్మికి సిట్ అధికారులు వేస్తున్న ప్రశ్నలకు సంబంధించి వివరాలు కొన్ని ఛానళ్లలో అప్పుడే వచ్చేస్తున్నాయి. ఇప్పటికే విచారణకు సంబంధించి లీకులపై సినీ ప్రముఖులు పలువురు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి వేళ.. విచారణ మొదలైన 40 నిమిషాలకే.. విచారణలో భాగంగా అడుగున్న ప్రశ్నలు మీడియాలో రావటం సంచలనంగా మారింది.
ఇక.. విచారణలో అడుగుతున్నట్లుగా చెబుతున్న ప్రశ్నల పరంపరను చూస్తే.. మీకు.. పూరీ జగన్నాథ్ బ్యాచ్ తో మీకున్న సంబంధం ఏమిటి? పూరీ ఇంట్లో మీరు పార్టీలు చేసుకునే వారా? కెల్విన్ తో పరిచయం ఉందా? పార్టీల్లో మత్తుమందులు వినియోగించేవారా? తరచూ బ్యాంకాక్ ఎందుకు వెళుతుంటారు? పబ్ కు వెళ్లే అలవాటు ఉందా? పూరీ డ్రగ్స్ తీసుకుంటారా? అంటూ ఒకటి తర్వాత ఒకటిగా ప్రశ్నల్ని అధికారులు సంధిస్తున్నట్లుగా చెబుతున్నారు.