Begin typing your search above and press return to search.
లవ్‌స్టోరీలలో వీటికే అగ్ర తాంబూలం!
By: Tupaki Desk | 27 Dec 2022 2:30 PM GMTయాక్షన్, ఊర మాస్, హారర్ థ్రిల్లర్ సినిమాలు ఎన్నొచ్చినా ప్రేమ కథల పట్ల ప్రేక్షకులు చూపించే ఆసక్తి వేరు. ఎందుకంటే సినిమాలకు మహారాజ పోషకులు యూతేకాబట్టి. వారిని ప్రసన్నం చేసుకుంటేనే థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యేది. బొమ్మ థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడేది. అలాంటి ప్రేక్షకుల్ని ప్రసన్నం చేసుకోవడాని మేకర్స్ ఎన్ని జోనర్ లని ఎంచుకున్నా ప్రధానంగా లవ్ స్టోరీలకు మాత్రం ప్రతీ ఏడాది పెద్ద పీట వేస్తుంటారు. ఈ ఏడాది కూడా మేకర్స్ ప్రేమ కథలకే పెద్ద పీట వేశారు.
అయితే అందులో మనసుకు హత్తుకుని.. మధురానుభూతిని కలిగించి సరికొత్త ఫీల్ ని అందించిన లవ్‌స్టోరీలకే ప్రేక్షకులు పట్టం కట్టారు. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పట్టడమే కాకుండా వాటికి కాసులు వర్షం కురిపించారు. బ్లాక్ బస్టర్ హిట్ లుగా జేజేలు పలికారు. ఈ ఏడాది ఆరంభం సరికొత్త ప్రేమ కథగా పీరియాడిక్ ఫిక్షనల్ లవ్ స్టోరీగా రూపొందిన `రాధేశ్యామ్` వంటి పాన్ ఇండియా మూవీతో ప్రేమ కథల జర్నీ మొదలైంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించారు.
భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రేక్షకుల్ని ఏ విషయంలోనూ సంతృప్తి పరచలేక బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది. అయితే ప్రేక్షకులకు మాత్రం సరికొత్త ప్రేమ కథ అనే ఫీల్ ని మాత్రం కలిగించి విజువల్ గా ఆకట్టుకుంది. ఇక ఓ నక్సలైట్ ఉద్యమకారుడి ప్రేమ కోసం తపించే యువతి కథగా రూపొందిన మూవీ `విరాటపర్వం`. రానా, సాయి పల్లవి జంటగా నటించారు.
వేణు ఊడుగుల రూపొందించిన ఈ మూవీ ఓ యువతి సరికొత్త ప్రేమ గాధగా నిలిచిందే కానీ ఆశించిన విధంగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సాయి పల్లవి పాత్రకు మాత్రం ప్రశంసలు దక్కాయి. సుధీర్ బాబు `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నాగచైతన్య `థ్యాంక్యూ` చిత్రాలు కూడా ప్రేమ కథల నేపథ్యంలో రూపొందినవే. అయితే ఇవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. భారీ అంచనాలతో మురిపించాయే కానీ ఆ స్థాయిలో మెస్మరైజ్ చేయలేకపోయాయి.
అయితే ఈ రెండు సినిమాల మధ్యలో విడుదలైన `సీతారమం` మాత్రం ఎపిక్ లవ్ స్టోరీగా అందరి హృదాయల్ని దోచేసింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీని హను రాఘవపూడి రూపొందించాడు. పీరియాడిక్ ఎపిక్ లవ్ స్టోరీగా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఎవరూ లేని ఓ సోల్జర్ జీవితంలోకి ప్రిన్సెస్ నూర్జహాన్ ప్రవేశించడం.. అది పాకిస్తాన్ చెరలో బందీగా వున్న అతనికి చివరి నిమిషంలో తెలియడం వంటి సున్నితమైన భావోద్వేగాల సమాహారంగా సాగిన ఈ మూవీ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.