Begin typing your search above and press return to search.

ఆనంద‌మంతా సీత‌మ్మ‌ సొంతం? ఇంత‌కీ ఎవ‌రా సీత‌!

By:  Tupaki Desk   |   3 Oct 2022 9:30 AM GMT
ఆనంద‌మంతా సీత‌మ్మ‌ సొంతం? ఇంత‌కీ ఎవ‌రా సీత‌!
X
ఇంత‌వ‌ర‌కూ 2022 బాలీవుడ్ కి క‌లిసిరాక‌పోయినా...యంగ్ బ్యూటీ అలియాభ‌ట్ కి మాత్రం బాగా కలిసొచ్చింద‌నే చెప్పాలి. ఏడాది ఆరంభంలోనే 'గంగూబాయి క‌తియావాడి' తో బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా స‌త్తా చాటింది. అలియా తొలి ఉమెన్ సెంట్రిక్ చిత్రం భారీ వ‌సూళ్లు సాధించ‌డంతో అమ్మ‌డి పేరు ఇంటా..బ‌య‌టా హాట్ టాపిక్ గా మారింది.

లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లోనూ అలియా త‌క్కువేం? కాద‌ని నిరూపించింది. అటుపై ప్రేమించిన చెలికాడు ర‌ణ‌బీర్ క‌పూర్ ని పెళ్లాడి క‌పూర్ ఇంట కోడ‌లిగా అడుగుపెట్టింది. రిషీక‌పూర్ గుమ్మంలో కాలు పెట్టిన వెళా విశేషం..ఆ వెంట‌నే గ‌ర్భం దాల్చింది. పెళ్లైనా ఏడాదే మాతృమూర్తిగాను ప్ర‌మోట్ అవుతుంది. ఇది అలియా కెరీర్ లో ఎప్ప‌టికీ బెస్ట్ మూవ్ మెంట్ గా నిలిచిపోతుంది.

అటుపై బ్ర‌హ్మాస్ర్త‌లో భ‌ర్త‌తో కలిసి తెర‌ను పంచుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాన‌ప్ప‌టికీ భారీ ఎపెనింగ్స్ తెచ్చిపెట్టి ఊసురుమంటోన్న బాలీవుడ్ కి ఊపిరి పోసింది. అంత‌కు ముందు 'ఆర్ ఆర్ ఆర్' తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని పాన్ ఇండియా భామ‌గా అవ‌త‌రించింది. సౌత్ లో అలియాకి మంచి పేరు తీసుకొచ్చిన చిత్ర‌మ‌ది. సీత‌మ్మ పాత్ర‌లో ఆద్యంతం ఆక‌ట్టుకుంది.

టాలీవుడ్ లో అవ‌కాశాల‌కు పూల బాట వేసిన చిత్రంగా నిలిచింది. ఇదే ఏడాది అలియా హాలీవుడ్ ఎంట్రీ కూడా ఖ‌రారైంది. 'హార్ట్ ఆఫ్ స్టోన్' చిత్రంతో హాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. సాహ‌సోపేత‌మైన పాత్ర‌లో ఇంగ్లీష్ అభిమానుల్ని సంపాదించుకోబోతుంది. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ తో హాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ ఐడెంటిటీని ద‌క్కించుకోబోతుంది. అలాగే ఇటీవ‌లే టైట్స్ 100 ఇంపాక్ట్ అవార్డుకి ఎంపికైంది. ఆదివారం సింగ‌పూర్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పుర‌స్కారం అందుకుంది.

ఈ సంద‌ర్భంగా ఇన్ స్టా వేదిక‌గా ప‌రివ‌శించిపోయింది. అవార్డును ముద్దాడుతూ..గొప్ప అచీవ్ మెంట్ గా సంతోషం వ్య‌క్తం చేసింది. ఇలా ఏడాది ముగింపుకు చేరుకునే స‌రికి అలియా నుంచి ప్ర‌తీది వండ‌ర్ గానే క‌నిపిస్తుంది. ఇంకా మూడు నెల‌లు స‌మ‌యం ఉంది. అదృష్టం వెంటాడుతోన్న నేప‌థ్యంలో మ‌రిన్ని మిరాకిల్స్ జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సం లేదు.

స‌రికొత్త‌గా త‌న‌ను తాను ప్ర‌జెంట్ చేసుకుంటోన్న విధానం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హాని' చిత్రంలో న‌టిస్తోంది. వ‌చ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. అలాగే హాలీవుడ్ మూవీ ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకుంది. 2023 లో ఆ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.