Begin typing your search above and press return to search.

మహేష్‌ ఫౌండేషన్ కోసం సితార ఫస్ట్‌ డొనేషన్‌

By:  Tupaki Desk   |   2 Jan 2023 5:11 PM GMT
మహేష్‌ ఫౌండేషన్ కోసం సితార ఫస్ట్‌ డొనేషన్‌
X
టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారు. వేలాది మంది చిన్న పిల్లల యొక్క గుండె ఆపరేషన్స్ ను చేయించిన మహేష్ బాబు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు గాను మహేష్ బాబు ఫౌండేషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

కొత్త సంవత్సరం సందర్భంగా మహేష్ బాబు యొక్క అధికారిక వెబ్‌ సైట్ ను ప్రారంభించారు. ఆ వెబ్‌ సైట్‌ ను మహేష్ బాబు యొక్క గారాల పట్టి సితార తో ఓపెన్‌ చేయించారు. సోషల్ మీడియా ద్వారా సితార స్పందిస్తూ మహేష్ బాబు ఫౌండేషన్ యొక్క వెబ్‌ సైట్‌ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది.

ఇలాంటి ఒక గొప్ప పనిలో భాగస్వామ్యం అవ్వాలని నేను చాలా కాలం నుండి కోరుకుంటున్నాను. ఈ వెబ్‌ సైట్‌ ను ప్రారంభించడం అనేది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అంటూనే తన యొక్క పాకెట్‌ మనీని మహేష్ బాబు ఫౌండేషన్ కు విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొంది. మీ వంతు సాయం మహేష్ బాబు ఫౌండేషన్‌ ద్వారా చేయండి అంటూ ఆమె మహేష్‌ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేసింది.

మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది సమ్మర్‌ లో సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ వరుస విషాదాల కారణంగా సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేక పోతున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్‌ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరి సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.