Begin typing your search above and press return to search.

ప్రపంచానికి మీరు సూపర్‌ స్టార్‌.. కాని మాకు మీరే ప్రపంచం

By:  Tupaki Desk   |   9 Aug 2021 4:30 PM GMT
ప్రపంచానికి మీరు సూపర్‌ స్టార్‌.. కాని మాకు మీరే ప్రపంచం
X
నేడు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా లక్షల మంది అభిమానులు సోషల్‌ మీడియాలో ట్వీట్స్ చేశారు.. చేస్తూనే ఉన్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా చిరంజీవి.. వెంకటేష్‌.. ఎన్టీఆర్‌.. రామ్‌ చరణ్‌ ఇంకా ఎంతో మంది ప్రముఖులు కూడా సోషల్‌ మీడియా ద్వారా మహేష్‌ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఎంత మంది ఎలా చెప్పినా కూడా ఆయన కుటుంబ సభ్యులు చెప్పే శుభాకాంక్షలు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. నమ్రత మరియు సితార ఇంకా గౌతమ్‌ లు ఎలా మహేష్ బాబుకు శుభాకాంక్షలు చెప్పారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఉంటుంది. సితార పాప సోషల్‌ మీడియాలో చాలా ఇంట్రెస్టింగ్‌ అండ్‌ హాట్ టచ్చింగ్‌ పోస్ట్‌ ను పెట్టింది.

నాన్న కూతుర్ల మద్య కామన్‌ గానే చాలా బాండ్డింగ్‌ ఉంటుంది. ఇద్దరు కూడా సమయం దొరికితే చాలు అన్నట్లుగా సరదా ముచ్చట్లు ఆటల్లో పడిపోతారు. ఆ విషయాలను సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. గౌతమ్‌ తో కంటే ఎక్కువగా సితారతో సమయం గడుపుతూ మహేష్‌ బాబు కనిపించడం అందరు చూస్తూనే ఉంటారు. అలాంటి నాన్న పుట్టిన రోజున సితార పాప ఎలా శుభాకాంక్షలు చెప్పింది అనేది ఆసక్తిగా చూశారు. ఆమె చాలా ఎమోషనల్‌ గా చాలా హార్ట్‌ టచ్చింగ్‌ గా శుభాకాంక్షలు చెప్పింది.

ఇన్‌ స్టాలో నాన్నతో కలిసి దిగిన రీసెంట్‌ ఫొటోను షేర్‌ చేసిన సితార.. మీరు ప్రపంచానికి సూపర్‌ స్టార్‌ అయితే మాకు మాత్రం మీరే ప్రపంచం. హ్యాపీ బర్త్‌ డే నాన్న. మా ఆటల్లో, అల్లరిలో అన్నింట కూడా మాకు బెస్ట్‌ డాడీగా మాతో ఉన్నందుకు కృతజ్ఞతలు. మీరు ఎప్పటికి ది బెస్ట్‌ అంటూ కామెంట్‌ పెట్టింది. సోషల్‌ మీడియాలో సితార చేసిన పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. సితార చూస్తుండగానే పెద్ద పాప అయ్యింది. ఆమె మాటలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. క్యూట్‌ ప్రిన్సెస్ ను కలిగి ఉన్న మహేష్‌ బాబు చాలా లక్కీ అంటూ కొందరు.. సూపర్ స్టార్‌ తండ్రి అయినందుకు సితార లక్కీ అంటూ కొందరు అభిమానులు కామెంట్స్‌ చేశారు.