Begin typing your search above and press return to search.

సితార పాప ట్రెడిష‌న‌ల్ లుక్ లో అద‌ర‌గొట్టిందిగా!

By:  Tupaki Desk   |   13 Jan 2023 11:30 AM GMT
సితార పాప ట్రెడిష‌న‌ల్ లుక్ లో అద‌ర‌గొట్టిందిగా!
X
టాలీవుడ్ టాప్ స్టార్ల‌కు సంబంధించిన వార‌సులు సినిమాల‌తో పాటు నెట్టింట సంద‌డి చేస్తూ త‌మ ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటుంటారు. అయితే అలాంటి వాళ్ల‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూతురు సితార శైలి ప్ర‌త్యేకం. సూప‌ర్ స్టార్ కూతురే అయినా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త వుండాల‌ని చిన్న వ‌య‌సు నుంచే త‌న ప్ర‌తిభ‌ని చాటుకుంటూ ప్ర‌త్యేకంగా నిలుస్తోంది. స్టార్ కిడ్ గా ప్ర‌పంచానికి ప‌రిచ‌య‌మైన సితార సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇన్ స్టా హ్యాండిల్ వుంది. ఇన్ స్టాలో త‌న‌ని ఫాలో అవుతున్న ఫాలోవ‌ర్స్ కౌంట్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సితార‌ను నెట్టింట ఫాలో అవుతున్న వారి సంఖ్య వ‌న్ మిలియ‌న్ పైనే వుండ‌టం విశేషం. హాలీవుడ్ ఫేవ‌రేట్ మ్యూజికల్ సాంగ్స్ కి క‌వ‌ర్ సాంగ్స్ చేయ‌డ‌మే కాకుండా త‌న‌దైన డ్యాన్స్ తో మెరుపులు మెరిపిస్తూ నెటిజ‌న్ ల‌ని సితార పాప విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

రీసెంట్ గా మ‌హేష్ న‌టించిన 'స‌ర్కారు వారి పాట‌' మూవీలోని 'ఎవ్రీ పెన్నీ' ప్ర‌మోష‌న‌ల్ వీడియోలో న‌టించి సితార అద‌ర‌గొట్టేసింది. నిత్యం నెట్టింట పోస్ట్ లు పెడుతూ ఆక‌ట్టుకుంటున్న సితార పాప తాజాగా శుక్రవారం షేర్ చేసిన ఫొటో నెటిజ‌న్ ల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్ గా మారింది.

మామూలు వేళ‌ల్లోనే స్ట‌న్నింగ్ పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఆక‌ట్టుకునే సితార సంక్రాంతి పండ‌గ వేళ సంప్ర‌దాయ దుస్తుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌డం మ‌హేష్ ఫ్యాన్స్ ని ఆక‌ట్టుకుంటోంది.

ఆస‌క్తిక‌ర‌మైన వేష‌ధార‌ణ‌లో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వైట్ క‌ల‌ర్ ప్ల‌వ‌ర్స్ లెహంగాలో ప‌ర్పుల్ క‌ల‌ర్ బ్లౌజ్ ధ‌రించిన సితార పాప ట్రెడిష‌న‌ల్ లుక్ లో అద‌ర‌గొట్టింది. సంక్రాంతి పండ‌గ వేళ సితార పాప ట్రెడిష‌న‌ల్ లుక్ లో క‌నువిందు చేయ‌డంతో అంతా త‌న‌పై బుట్ట‌బొమ్మ అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇటీవ‌ల పింక్ క‌ల‌ర్ డ్రెస్ లో మెరిసిన సితార తాజాగా పండ‌గ వేళ సంప్ర‌దాయ దుస్తుల్లో మెర‌వ‌డం విశేషం.

సితార పాప షేర్ చేసిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. సితార స్పీడు చూస్తుంటే అన్న‌య్య గౌత‌మ్ లాగే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలానే క‌నిపిస్తోంద‌ని నెటిజ‌న్ లు కామెంట్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.