Begin typing your search above and press return to search.

అక్కా చెల్లి అన్నీ సీతా పాపే.. షాకిస్తున్న‌ ద్విపాత్రాభిన‌యం?

By:  Tupaki Desk   |   31 March 2021 7:57 AM GMT
అక్కా చెల్లి అన్నీ సీతా పాపే.. షాకిస్తున్న‌ ద్విపాత్రాభిన‌యం?
X
ఆ అంద‌మైన న‌వ్వు.. చూసే చూపు.. హెయిర్ డిజైన్.. ఎంపిక చేసిన‌ వేష‌ధార‌ణ.. ఎక్స్ ప్రెష‌న్..‌ అన్నీ చూస్తుంటే సీతాపాప‌కు ట్విన్ సిస్ట‌ర్ ఉందా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. అంత‌గా ఒదిగిపోయి క‌నిపిస్తోంది ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో. క‌ల‌ర్ లో .. బ్లాక్ అండ్ వైట్ లో సీతా పాప డిఫ‌రెంట్ లుక్స్ ఇలా వెబ్ లోకి రాగానే అలా ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల్లో వైర‌ల్ గా మారాయి.

అక్కా చెల్లి అన్నీ సీతా పాపే.. అన్న‌ట్టుగా ఉంది ఈ ఫోటోషూట్ లో వేరియేష‌న్. అంత‌గా విభిన్న‌మైన‌ ఫోజుల‌తో అద‌ర‌గొట్టిన సితార లుక్ చూస్తుంటే వారెవ్వా అనాల్సిందే. ముఖ్యంగా ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో సితార‌కు రెండు వేరియేష‌న్స్ తో హెయిర్ ని డిజైన్ చేయ‌డంతో సీతాపాప ట్విన్ సిస్ట‌ర్స్ అని భ్ర‌మించాల్సొస్తోంది.

ఇటీవ‌ల సితార బెస్ట్ ఫోటో షూట్ ఇది. ఆ డిజైన‌ర్ డ్రెస్ త‌న క్యూట్ నెస్ ని మ‌రింత‌గా పెంచేసిందంటే అతిశ‌యోక్తి కాదు. ``సితార స‌రికొత్త‌ ప్రపంచాన్ని చూస్తోంది. ఎప్పటిలాగే కాదు .. కానీ బహుశా అది కొంచెం మాయాజాలంతో కావచ్చు! మ్యాజిక్ మాతో ప్రారంభమవుతుంది. # బ్లూమ్ సీరీస్`` అంటూ న‌మ్ర‌త ఈ ఫోటో‌ల‌ను ఇన్ స్టాలో షేర్ చేశారు. నితీషా స్టైలిష్ట్ కాగా.. స్మరితా విన్నకోట ఫోటోగ్ర‌ఫీ అందించారు. అన్న‌ట్టు సితార ద్విపాత్రాభిన‌యంలో ఏదైనా వెబ్ సిరీస్ కానీ.. షార్ట్ ఫిలిం కానీ.. లేదా పూర్తి ఫీచ‌ర్ ఫిలిం కానీ వ‌స్తుందా? అన్న ఆస‌క్తి ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల్లో ఉంది. మ‌రి న‌మ్ర‌త మ‌హేష్ స‌మాధానం ఏమై ఉంటుంది?