Begin typing your search above and press return to search.
సీతారామం బ్యూటీ రీయూనియన్ ఎవరితో?
By: Tupaki Desk | 2 Nov 2022 5:36 AM GMTసందర్భం ఏది అయినా కానీ సహనటుడితో పదే పదే కథానాయికలు జంటగా కనిపిస్తుంటే రకరకాల పుకార్లు పుట్టుకొస్తుంటాయి. అలాంటి పుకార్లు ఏవీ లేకపోయినా కానీ తన సహనటుడు చాక్లెట్ బోయ్ కం బంగారం దుల్కార్ సల్మాన్ తో సీతారామం బ్యూటీ పదే పదే సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తున్న తీరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
నోడౌట్.. ఆ ఇద్దరూ గుడ్ ఫ్రెండ్స్. కానీ ప్రతిసారీ ఇలా రీయునైటెడ్ అంటూ దుల్కార్ తో ఈ అమ్మడు ఇస్తున్న ఫోజులు గుబులు పుట్టిస్తున్నాయి. యంగ్ అండ్ హాట్ గయ్ దుల్కార్ తో కలిసి ఇలా ఓ ఫోటో దిగి.. రీయునైటెడ్ ఇన్ అజ్! అంటూ వ్యాఖ్యను జోడించింది మృణాల్. సీతారామంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది. తనదైన అందం నటనతో మెప్పించింది. మృణాల్ ఇటీవల వరుస ఇంటర్వ్యూలతో హీట్ పెంచుతోంది. తదుపరి కెరీర్ పై బిగ్ ప్లానింగ్ తో ముందుకు సాగుతోంది.
ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్‌లో స్వప్న అనుమోలు మిశ్రూతో కలిసి సందడి చేసిన ఈ బ్యూటీ షోస్టాపర్‌గా నిలిచింది. హైదరాబాద్ కు చెందిన మిశ్రూ అనే లేబుల్ కి ఈ బ్యూటీ బాగానే ప్రచారం చేసింది. మృణాల్ ఠాకూర్ మిశ్రూకి షోస్టాపర్ గా వ్యవహరించింది.
నటన పరంగా మీరు సీతా రామం కోసం మంచి సమీక్షలను అందుకున్నారు. ఇది ఎలా అనిపిస్తోంది? అని హైదరాబాద్ మీడియా ప్రశ్నించగా.. ఇలా స్పందించింది. ''నేను దీనిని గొప్పగా భావిస్తున్నాను. నా తొలి చిత్రం బాగా ఆడింది. దక్షిణ భారతదేశం నుండి చాలా ప్రేమను పొందడం సంతోషం. నా డిజైనర్ మిశ్రూ కూడా హైదరాబాదీనే. ఈ బంధంలో మరొక కనెక్షన్ ఉంది. హైదరాబాదీ డిజైనర్ తో కలిసి పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది'' అని తెలిపింది.
సినిమా కోసం తెలుగు నేర్చుకోవడం ఎంత కష్టమో కూడా ఈ భామ మాట్లాడింది. ''నిజంగా తెలుగు భాష కష్టం. కానీ ఒకసారి నేర్చుకుంటే చాలా ఆనందించవచ్చు. నేను హైదరాబాదులో ఎక్కువ సమయం గడపాలి. భాషను అలవాటు చేసుకోవాలి. రెండో ఇల్లుగా మార్చుకుంటున్నా'' అని కూడా అంది.
టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వైరుధ్యాలపైనా మృణాల్ మాట్లాడింది. ఈ రెండు పరిశ్రమల మధ్య చాలా తేడా ఉంది. టాలీవుడ్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే అక్కడ చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఇది బాలీవుడ్ లో లేదు. తెలుగు భాష భిన్నంగా ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ భిన్నంగా ఉంటుంది. నా మొదటి చిత్రం లైఫ్ టైమ్ అనుభవం కంటే చాలా పెద్దది. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని అని అన్నారు.
తదుపరి ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడుతూ.. 'పిప్పా' డిసెంబర్ 2న విడుదల కానుంది. ఇండియా-బంగ్లాదేశ్ 1971 యుద్ధం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. నేను ఈ చిత్రం చేసే వరకు ఈ యుద్ధం గురించి నాకు నిజంగా తెలియదు. చాలా అందమైన విషయాలు తెలిసాయి. ప్రజలు యుద్ధంలో ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలను తెలుసుకుని షాకయ్యాను అని కూడా మృణాల్ తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.