Begin typing your search above and press return to search.
సీతారామం.. మొదటి రోజు కలెక్షన్స్ !
By: Tupaki Desk | 6 Aug 2022 6:58 AM GMTవైజయంతి మూవీస్ నుంచి వచ్చిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు పరవాలేదు అనే విధంగా ఓపెనింగ్స్ అయితే అందుకుంది. దుల్కర్ సల్మాన్ మృనల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న, సుమంత్ ముఖ్య పాత్రల్లో నటించారు.
మొత్తానికి సినిమాకు అయితే సూపర్ హిట్ టాక్ వచ్చింది. మోడ్రన్ క్లాసిక్ మూవీ అంటూ డైరెక్టర్ హను రాఘవపూడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
చాలా రోజుల తరువాత ఒక మంచి పోయేట్రి ఫిల్మ్ చూసినట్లు ఉందని కూడా చెబుతున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు కూడా మంచి హైప్ అయితే క్రియేట్ చేసింది. ఇక మొదట రోజు వరల్డ్ వైడ్ గా 3 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకుంది.
క్లాసిక్ హిట్ అనే టాక్ స్ప్రెడ్ అవ్వుతుంది రెండవ రోజు నుంచి కలెక్షన్స్ డబల్ అయ్యే ఛాన్స్ గట్టిగా ఉంది . అయితే సీతారామం హిట్ అనిపించుకోవాలటే కనీసం 18 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది అది పెద్ద కష్టం కాకపోవచ్చు.
విడుదలైన ఫస్ట్ డే మ్యాట్నీ షో నుంచి నెంబర్లు డబుల్ అవుతున్నట్లు తెలుస్తోంది. శనివారం, ఆదివారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఇక మరోవైపు మాస్ ఆడియెన్స్ లో మంచి డిమాండ్ దక్కించుకున్న బింబిసార పోటీగా ఉంది.
ఇక సోమవారం నుంచి అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది. దుల్కర్ సల్మాన్ నటన ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. అలాగే విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కూడా ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఫైనల్ గా హను రాఘవపూడి అసలైన సక్సెస్ కొట్టాడు అని చెప్పవచ్చు. ఇంతకుముందు ఈ దర్శకుడు తీసిన లై, పడి పడి లేచే మనసు దారుణంగా దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే.