Begin typing your search above and press return to search.
బ్లాక్ డ్రెస్సుతో హీటెక్కిస్తున్న సీతారామం బ్యూటీ
By: Tupaki Desk | 19 Jan 2023 7:44 AM GMTసీతారామం చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల గండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ మృనాల్ ఠాకూర్. తన అందం, అభినయంతో అందరినీ కట్టి పడేసింది. సీతారామం సినిమాలో నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసి.. అందరి మనసుల్లో సీతగా నిలిచిపోయింది. సంప్రదాయ పద్ధతిలో చక్కనైన చీర కట్టులో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. పొట్టి పొట్టి గౌనుల్లో కూడా ట్రెండీగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తనకు సంబంధించిన సినిమా అప్ డేట్లతో పాటు ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అయితే తాజాగా ఆమె ఓ బ్లాక్ డ్రెస్ వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో చూసేందుకు చాలా క్యూట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. లోనెక్ తో తన అందాలను ఆరబోసింది. అదిరిపోయే స్మైల్ తో అందిరినీ మెస్మరైజే చేసింది.
అయితే ఈ ఫొటోలు చూసిన చాలా మంది అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో నిన్న సీతగా చూడాలనుకుంటున్నాం.. ఇలాంటి బట్టలు వేసుకోకంటూ చెబుతున్నారు. ఈ మధ్య నువ్వు ఎక్కువగా ట్రెండీ దుస్తుల్లోనే కనిపిస్తున్నావని.. మరోసారి చీర కట్టుకోమని సూచిస్తున్నారు.
చీరలో నీ అందం, అమాయకత్వం అందరికీ నచ్చాయని నెటిజెన్లు అంటున్నారు. కానీ ఇలా గ్లామర్ షో చేయడం నీ ఫ్యాన్స్ గా మాకు నచ్చట్లేదని అసహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో నటిగా ఆమె అన్ని రకాల పాత్రలు చేయాల్సిందేనని.. కేవలం సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా, ట్రెండీ లుక్ లో కూడా కనిపించాల్సిందేనని అంటున్నారు. మరి తన అభిమానులపై ఈ బాలీవుడ్ బ్యూటీ ఎలా స్పందించనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.
2014లో మరాఠీ సినిమా విట్టి దండుతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. సీతారామం సినిమా తర్వాత ఆమె అరడజనుకు పైగా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిందంటూ వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే ఆమె త్వరలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకోవడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీతారామం సినిమా తర్వాత పారితోషికం విషయంలో కూడా ఈ బాలీవుడ్ బ్యూటీ ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.