Begin typing your search above and press return to search.

'సీతారామం' సోమవారం కూడా సందడే

By:  Tupaki Desk   |   9 Aug 2022 5:37 AM GMT
సీతారామం సోమవారం కూడా సందడే
X
దుల్కర్ సల్మాన్‌ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా భారీ వసూళ్లు దిశగా దూసుకు పోతుంది. ఈ సినిమాకి 18 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మొదటి మూడు రోజుల్లో 10 కోట్ల కు పైగా షేర్‌ దక్కింది. సోమవారం నుంచి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్న సమయంలో యూనిట్‌ సభ్యులు బయ్యర్లు ఊపిరి పీల్చుకునేలా వసూళ్లు నమోదు అయ్యాయి.

ఒక వైపు బింబిసార సందడి కొనసాగుతూ ఉండగానే మరో వైపు సీతారామం కి కూడా సోమవారం మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో ఇంకా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. సోమవారం ఒక మీడియం బడ్జెట్‌ సినిమా సాదించే వసూళ్ల కంటే సీతారామం సినిమా ఎక్కువగానే రాబట్టింది అనేది ట్రేడ్‌ వర్గాల టాక్.

సోమవారం డీసెంట్ షేర్ ను రాబట్టగా మంగళవారం మొహరం పండుగ కారణంగా మళ్లీ వీకెండ్‌ లో వచ్చినట్లుగా భారీ షేర్‌ ను సీతారామం రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాఖీ పండుగ సెలవు కూడా సీతారామం కు కలిసి వచ్చే అవకాశం ఉంది. వీకెండ్‌ వరకు ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ ను సాధించే అవకాశం ఉందని.. అతి త్వరలోనే ఈ సినిమా కూడా లాభాల బాట పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మొత్తానికి బింబిసార వంటి మాస్ సినిమాతో పోటీ పడి మరీ వైవిధ్యభరిత సినిమా అయిన సీతారామం కూడా మంచి వసూళ్లను రాబట్టడం మంచి పరిణామం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు పోటీ లేకుండా ఉండి సోలో రిలీజ్ అయ్యి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

ఒక చక్కని ప్రేమ కథను మంచి స్క్రీన్‌ ప్లే తో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన తీరును ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. రష్మిక మందన్నా ఒక స్టార్‌ హీరోయిన్‌ అయ్యి ఉండి ఇలాంటి పాత్ర ను చేసేందుకు ఒప్పుకుని ఆమె సినిమా స్థాయిని పెంచింది అనడంలో సందేహం లేదు. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్‌ లో పాజిటివ్‌ హోప్ ను కలిగించడంలో సూపర్ హిట్‌ అయ్యింది అనడంలో సందేహం లేదు.