Begin typing your search above and press return to search.
'సీతారామం' దర్శకుడు మరో క్లాసిక్ స్టోరీతోనా?
By: Tupaki Desk | 28 Nov 2022 6:35 AM GMT'అందాల రాక్షసి' తర్వాత దర్శకుడు హను రాఘవపూడికి అంతకు మించిన పేరు తీసుకొచ్చింది 'సీతారామం'. ఇటీవల రిలీజ్ అయిన సినిమా సక్సెస్ గురించి మాటల్లో చెప్పలేనిది. టాలీవుడ్ లవ్ స్టోరీల్లో మరో క్లాసిక్ హిట్ ఇది. 'అందాల రాక్షసి' మంచి దర్శకుడిగా పేరు తెచ్చింది తప్ప కమర్శియల్ గా వర్కౌట్ కాలేదు. కానీ 'సీతారామం' పేరుతో పాటు కాసులు భారీగానే తెచ్చిపెట్టింది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో హను ఐడెంటిటీ కూడా చాలా ఛేంజ్ అయింది. ఒకప్పుడు ముఖం చాటేసే నిర్మాతలు ఇప్పుడు ఎదురెళ్లి అతనితో సినిమాలు చేస్తాం అంటున్నారు. మా బ్యానర్లో సినిమాలు చేయండి అంటూ అడ్వాన్సులు చెల్లించడానికి రెడీగా ఉన్నారు. దీంతో దర్శకుడిగా హను కెరీర్ ఓ ట్రాక్ లో పడినట్లే. ఇప్పుడు పెద్ద బ్యానర్లో అవకాశాలు వస్తున్నాయి.
మళ్లీ రెండు..ప్లాప్ లు ఇచ్చినా సీతారామం సక్సెస్ కొన్నాళ్ల పాటు కాపాడుతుందని చెప్పొచ్చు. అయినా హను ఈసారి సక్సెస్ ని కంటున్యూ చేయాలనుకుంటున్నాడు. పోటీ వాతావరణంలో నెమ్మదిగా సాగితే పనవ్వదని గ్రహించి వేగం పెంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి తాను నమ్మిన ఫార్ములా బేస్డ్ చిత్రాన్నే తీయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.
మరోసారి ఓ క్లాసిక్ లవ్ స్టోరీని సిద్దం చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ అని...గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో సాగుతుందని సమాచారం. ఇంతవరకూ ఇండియన్ స్ర్కీన్ పై ఏ దర్శకుడు తీసుకొని సరికొత్త పాయింట్ అని..ఎంతో ఎగ్జైట్ మెంట్ తో కథ..కథనాలు సాగుతాయని ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.
ఇందులో నటీనటులు కూడా కొత్త వారు అవ్వడానికి అవకాశం ఉందని అంటున్నారు. ఈ కథకి పేరున్న నటులకన్నా...ఎలాంటి అంచనాలు లేని నటులైతేనే న్యాయం చేస్తారు అన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలిసింది. ఇక హను కథలు హీరోల ఇమేజ్ ని బేస్ చేసుకుని రాయరు. కథ రెడీ అయిన తర్వాత అందులో ఏ హీరో అయితే సెట్ అవుతాడో? వాళ్లని వెతికి పట్టుకుంటాడు.
టాలీవుడ్ లో అంత మంది యంగ్ స్టార్స్ ఉన్నా ఏరికోరి మరీ మలయాళం నటుడు దుల్కార్ సల్మాని తెచ్చి పెట్టారు. ఆ పాత్రకి ఆయన మాత్రమే న్యాయం చేస్తాడని విశ్వసించి ఎంపిక చేసారు. ఆ కథని దుల్కార్ అంతే నమ్మాడు కాబట్టే సాధ్యమైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.