Begin typing your search above and press return to search.
మోడ్రన్ క్లాసిక్ అంటున్నారే!
By: Tupaki Desk | 6 Aug 2022 10:30 AM GMTవరుస ఫ్లాపులతో సతమతమవుతూ థియేటర్లకు ప్రేక్షకులు ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో ఇండస్ట్రీ పరిస్థితి ఏంటీ? ఈ గండం నుంచి గట్టెక్కించేది ఎవరు? అంటూ యావత్ టాలీవుడ్ మొత్తం ఆశతో ఎదురుచూస్తున్న వేళ శుక్రవారం విడుదలైన సినిమాలు సీతారామం, బింబిసార సూపర్ హిట్ టాక్ తో కొండం ధైర్యాన్నిచ్చాయి.
అయితే ఈ రెండు సినిమాల్లో ప్రస్తుతం ప్రత్యేకంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సినిమా `సీతారామం`. ఈ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి. గత కొంత కాలంగా దర్శకుడు తీవ్ర విమర్శలని ఎదుర్కొంటున్నాడు.
ఇది తనకు డూ ఆర్ డై సిట్యువేషన్. ఈ సినిమా పోతే కెరీర్ కష్టమే అనే కామెంట్ లు ఇండస్ట్రీలో వినిపించాయి. అయితే వాటన్నింటికీ తన `సీతారామం`తో గట్టి సమాధానం చెప్పడం విశేషం. చూడగానే చూడముచ్చటేసే అందమైన ప్రేమ జంట.. ప్రతి సన్నివేశంలో జీవం తొణికిసలాడేలా ఉండే పాత్రలు.. వారి హావభావాలు.. భావుకత నిండిన సన్నివేశాలు...మాటలు..దృశ్యాలు..ఆహ్లదకరమైన సంగీతం..కనువిందు చేసే ఛాయాగ్రహణం.. ప్రతి సన్నివేశంలోనూ తన అభిరుచిని..తపనను చాటే దర్శకుడి ప్రతిభ..
ఒక ప్రేమకథకు ఇంతకు మించినవి ఏం కావాలి?..సగటు ప్రేక్షకుడు, విమర్శకుడు పట్టి చూపడానికి ఒక్కలోపం కూడా లేకుండా ఇలాంటి ఓ అందమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెలుగు తెరపై ఎన్నాళ్లయిందో? .. `అందాల రాక్షసి` సినిమాతో చక్కటి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరున్నప్పటికీ సినిమాను సగంలో చెడగొట్టేస్తాడని.. ఒక కథను పూర్తి స్థాయిలో అర్థవంతంగా మలిచి ప్రేక్షకుల్ని మెప్పించడంలో విఫలమవుతుంటాడనే ముద్ర హను రాఘవపూడిపై పడింది.
ఆ ముద్రని తొలగించుకోవాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా కాలం కలిసి రాకనో.. కాన్సెప్ట్ పై సరిగా ఫోకస్ చేయలేకపో తెలియదు కానీ హను రాఘవపూడి ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. అయితే తనలోని బలహీనతల్ని గుర్తించి వాటిని అధిగమిస్తూ ప్రేక్షకుడికి ఓ మధురానుభూతిని అందించే విధంగా `సీతారామం`ని హను రాఘవపూడి మలిచిన తీరు ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తూనే ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
సినిమా ఆరంభం నుంచి చివరి దాకా ప్రేక్షకుడిని కథలో లీనంచేసిన తీరుపై కూడా సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. దీంతో సినిమాపై విమర్శకులు ప్రశంసలు కురిపిస్తూ గుడ్ రివ్యూస్ ని అందించారు. అధునిక ప్రేమ కావ్యం అంటే ఇలానే వుంటుందని, ఇదొక మోడ్రన్ క్లాసిక్ అని `సీతారామం`తో పాటు దర్శకుడు హను రాఘవపూడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.