Begin typing your search above and press return to search.
సీతారామం అసలు బడ్జెట్, కలెక్షన్స్ ఇవే.. నిర్మాత క్లారిటీ!
By: Tupaki Desk | 23 Sep 2022 11:30 PM GMT40 కి పైగా సినిమాలు అనుభవం ఉన్న వైజయంతి మూవీస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే తప్పకుండా అందులో బలమైన కంటెంట్ ఉంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. జగదేకవీరుడు అతిలోకసుందరి - పెళ్లి సందడి - శుభలగ్నం - ఇంద్ర అలాగే సీనియర్ ఎన్టీఆర్ తో ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసిన అనుభవం ఆ సంస్థకి ఉంది. నిర్మాత సి.అశ్విని దత్ ఒక సినిమా కథను నమ్మారు అంటే దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు అని కాంప్రమైజ్ కారు చాలా సార్లు రుజువైంది.
గతంలో కంత్రి, శక్తి లాంటి పెద్ద సినిమాలతో ఆయన దెబ్బతిన్నప్పటికీ కూడా ఆ తర్వాత మళ్లీ మహానటి సినిమాతో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇక ఇటీవల వచ్చిన సీతారామం సినిమా కూడా మంచి ప్రాఫిట్ అందించింది. ఇక ఈ సినిమా బడ్జెట్ గురించి అలాగే కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో వెబ్ సైట్స్ లో అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత అశ్వినీదత్ అసలైన లెక్కల గురించి చాలా క్లారిటీగా తెలియజేశారు. ఇప్పటివరకు తాను ఎన్నో భిన్నమైన సినిమాలు నిర్మించాను అయితే చిన్న సినిమాల్లో పెళ్లి సందడి శుభలగ్నం తర్వాత నాకు అంత సంతృప్తి ఇచ్చిన ఏకైక సినిమా సీతారామం అని ఆయన చాలా మనస్ఫూర్తిగా తెలియజేశారు.
అయితే ఈ సినిమాకు ఆయన అసలు బడ్జెట్ అయితే రూ.51 కోట్లు అని ఇక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం పెట్టిన పెట్టుబడి కంటే 11 నుంచి 13 కోట్ల మధ్యలో ఎక్కువగా ప్రాఫిట్ వచ్చినట్లుగా అకౌంట్స్ చూసినవారు తనకు చెప్పారు అని ఆయన సున్నితంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఒక విధంగా దుల్కర్ సల్మాన్ - మృనల్ ఠాగూర్ లాంటి స్టార్స్ తో తెలుగులో మొదటిసారి ఇలా ప్రయత్నం చేయడం అనేది రిస్క్ తో కూడుకున్న పని కానీ దర్శకుడు చెప్పిన కథ కథనం కూడా చాలా నమ్మకంగా అనిపించాయని అందుకే ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తెరపైకి తీసుకు వచ్చినట్లుగా ఆయన వివరణ ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.