Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కి 'సీతారామం'..అక్క‌డా జెండా పాతేస్తుంది!

By:  Tupaki Desk   |   27 Aug 2022 9:30 AM GMT
బాలీవుడ్ కి సీతారామం..అక్క‌డా జెండా పాతేస్తుంది!
X
ఇటీవ‌ల రిలీజ్ అయిన 'సీతారామం' ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. తెలుగులో మ‌రో క్లాసిక్ హిట్ గా నిలిచింది. వైవిథ్య‌మైన ప్రేమ క‌థ‌ల‌కి ప్రేక్ష‌కులు ఎప్పుడు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డ‌తార‌ని మ‌రోసారి రుజ‌వైంది. తెలుగులో పాటు త‌మిం..మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ఏక కాలంలో రిలీజ్ అయి మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది. క‌మ‌ర్శియ‌ల్ గానూ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ని సాధించింది. రామ్ పాత్ర‌లో దుల్కార్ స‌ల్మాన్- సీత పాత్ర‌లో మృణాల్ ఠాకూర్ పెర్పార్మెన్స్ తోనే ఇది సాధ్య‌మైంది.

అంద‌మైన పాత్ర‌ల‌కి..అద్భుత‌మైన దృశ్య‌రూపం ఇచ్చారు. హ‌నురాఘ‌వ‌పూడి మ‌రోసారి త‌న‌దైన మార్క్ చిత్రంగా తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నారు. ఈ విజ‌యంతో ఎన్నో విముర్శ‌ల‌కు తెరదించారు. మ‌రోసారి హ‌ను పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిపోతుంది. బ‌డా బ్యాన‌ర్ల‌లో నయా ద‌ర్శ‌కుడికి అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి.

తాజాగా ఈ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. అనువాద రూపంలో సెప్టెంబ‌ర్ 2న ఉత్త‌రాది రాష్ర్టాల్లో చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ రిలీజ్ చేస్తుంది. ఇంకా హిందీ టైటిల్ ని రివీల్ చేయ‌లేదు. ఈ సినిమా ఉత్త‌రాది ప్రేక్ష‌కుల్ని త‌ప్ప‌క మెప్పిస్తుంద‌ని అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. ఓ దేశ సైనికుడి క‌థలో అద్భుత‌మైన ల‌వ్ స్టోరీని మేళ‌వించిన చిత్ర‌మిది.

అనాధైన ఓ సైనికుడికి భార్య పేరుతో వ‌చ్చే ఉత్త‌రాల‌తో మొద‌లైన ప్ర‌యాణం అటుపై ప్రేమ‌గా దారి తీయ‌డం..పాకిస్తాన్ ఆర్మీ చేతిలో ఆ సైనికుడు చిక్కుకోవ‌డం..చివ‌రికి ఆ ప్రేమ‌ను పెళ్లి వ‌ర‌కూ తీసుకెళ్ల‌లేక‌పోవ‌డం వంటి స‌న్నివేశాలు ఎమోష‌న‌ ల్ గా సౌత్ ఆడియ‌న్స్ కి బాగా క‌నెక్ట్ అయ్యాయి. సౌత్ లో ఇలాంటి జోన‌ర్ సినిమా రావ‌డం చాలా రేర్. ఆ ర‌కంగా హ‌ను ప్ర‌య‌త్నం ఇక్క‌డ ఫ‌లించింది.

ఈ నేప‌థ్యంలో ఇదే క‌థ బాలీవుడ్ లోనూ స‌క్సెస్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉంది. ల‌వ్.. ఎమోష‌న్.. దేశ‌భ‌క్తి క‌ల‌గ‌లిపిన సినిమాల‌కు నార్త్ ఆడియ‌న్స్ ఎన్నో సార్లు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. ఈ జాన‌ర్ సినిమాల‌కు అక్క‌డ మంచి డిమాండ్ ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో సీతారామం అక్క‌డా స‌క్సెస్ అయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. పైగా ఇటీవ‌ల కాలంలో తెలుగు సినిమాలు హిందీలో దున్నేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' ..'పుష్ప‌-2'..'కార్తికేయ‌-2' చిత్రాలు హిందీ బాక్సాపీస్ ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే సెంటిమెంట్ తో 'సీతారామం' సైతం రిపీట్ చేస్తుంద‌ని అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి.