Begin typing your search above and press return to search.
క్రికెట్ తో అవార్డ్ కొట్టిన సితార మరో ఆట మొదలు
By: Tupaki Desk | 24 March 2021 4:30 AM GMTచిన్న చిత్రాల నిర్మాణంతో మొదలైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థగా మారుతోంది. త్రివిక్రమ్ ఆశీర్వాదం ఈ సంస్థకు మెండుగా ఉండటంతో పాటు ప్రముఖులకు ఈ సంస్థపై గురి ఏర్పడటంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇండస్ట్రీలో దూసుకు పోతుంది. పెద్ద ఎత్తున సినిమాలు చేసేందుకు గాను ఇప్పటికే కథలు వింటున్నారు. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన జెర్సీ సినిమా రెండు అవార్డులను దక్కించుకుంది. ఆ ఉత్సాహంతో మరింత జోరుగా సినిమాలను నిర్మించేందుకు సితార వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. జెర్సీ సినిమాను క్రికెట్ నేపథ్యంలో నిర్మించిన సితార త్వరలో బాస్కెట్ బాల్ నేపథ్యంలో ఒక సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
'క్షణం' చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు రవికాంత్ పేరేపు తో సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఒక సినిమా రూపొందబోతుంది. రవికాంత్ బాస్కెట్ బాల్ నేపథ్యంలో కథను చెప్పినట్లుగా తెలుస్తోంది. కథ నచ్చిన నిర్మాతలు ప్రస్తుతం తమ సంస్థకు సన్నిహితం అయిన హీరోల వద్దకు ఆ కథను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఒకటి రెండు వారాల్లో ఒక యంగ్ స్టార్ హీరోకు ఆ కథను వినిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. బాస్కెట్ బాల్ నేపథ్యంలో ఎమోషనల్ గా సాగే ఆ కథ తప్పకుండా మరో మంచి సినిమా గా నిలుస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. త్వరలోనే ఈ బాస్కెట్ బాల్ సినిమా గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.