Begin typing your search above and press return to search.
భీమ్లా విడుదలకు ముందు ఏపీలో మళ్లీ మొదలైన లొల్లి..!
By: Tupaki Desk | 23 Feb 2022 8:32 PM ISTఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలు నియంత్రిస్తూ.. రోజుకు థియేటర్లలో నాలుగు షోలకు పరిమితం చేస్తూ గతేడాది ఏప్రిల్ లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినిమా చిన్నదైనా పెద్దదైనా రేట్ మాత్రం ఒకేలా ఉండాలని పేర్కొంటూ.. బెనిఫిట్ షోలు - ఐదో షోకు అనుమతి క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ సర్కారు నిర్ణయం చిన్న సినిమాలకు ఇబ్బంది కలిగించకపోయినా.. పెద్ద చిత్రాలపై మాత్రం గట్టి దెబ్బేసింది. అప్పటి నుంచి పెద్ద సినిమా రిలీజ్ కు రెడీ అయినప్పుడల్లా.. ప్రభుత్వ జీవో మీద చర్చలు జరుగుతూ వస్తున్నాయి. 'అఖండ' 'పుష్ప' వంటి సినిమాలు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో జీవో గురించి మాట్లాడకుండా.. ఏపీలో వచ్చిన కాడికి వసూళ్ళు రాబట్టుకున్నారు.
కానీ సినిమా టికెట్ ధరల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసిన 'శ్యామ్ సింగరాయ్' కు ఏపీలో ఎదురు దెబ్బే ఎదురైంది. టికెట్ రేట్లు ప్రభుత్వ నిర్ణయానికి లోబడే ఉండాలని.. థియేటర్ల మీద రెవెన్యూ అధికారులు కొరడా జులిపించింది. లైసెన్స్ లు - సేఫ్టీ మెజర్స్ అంటూ అన్నీ బయటకు తీసి సినిమా హాళ్లకు ఫైన్లు వేసి నోటీసులు జారీ చేశారు.
కొన్ని రోజులకు వ్యవహారం అంతా సర్దు మణిగింది. ఆ తర్వాత పెద్ద సినిమాల రిలీజులు లేకపోవడంతో దీనిపై రచ్చ జరగలేదు. సంక్రాంతికి రావాల్సిన పెద్ద చిత్రాల్నీ వాయిదా పడటం.. 'బంగార్రాజు' లాంటి సినిమాకి ఏపీలో టికెట్ రేట్లతో సమస్య లేకపోవడంతో ఎవరూ మాట్లాడలేదు. ప్రభుత్వం కూడా ఆ టైంలో థియేటర్లలోకి సినిమాలను చూసి చూడనట్లుగా వదిలేసాయి.
కానీ ఇప్పుడు కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో పోస్ట్ పోన్ అయిన భారీ సినిమాలు వరుసగా థియేటర్లకు క్యూ కడుతున్న నేపథ్యంలో.. మళ్లీ టికెట్ రేట్ల లొల్లి మొదలయ్యే పరిస్థితి వచ్చింది. మరో రెండు రోజుల్లో 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ ఉండగా.. ఏపీ ప్రభుత్వ జీవోని స్ట్రిక్ట్ గా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు.
ఆంధ్రాలో 'భీమ్లా నాయక్' సినిమాకు బెన్ ఫిట్ షోలకు అనుమతి లేదని.. అధిక రేట్లకు టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసారు. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో ప్రకారమే టికెట్ ధరలు - షోల ప్రదర్శన ఉండాలని సూచించారు. ప్రతి థియేటర్ వద్ద రెవెన్యూ అధికారులు నిఘా ఉంటుందని పేర్కొంటూ.. దీనికి థియేటర్ యాజమాన్యం సహకరించాలని ఈ మేరకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో పవన్ సినిమాపై గట్టి దెబ్బ పడే పరిస్థితి వచ్చి పడింది. ఆంధ్ర ప్రాంతంలో సుమారు 40 కోట్లకు సినిమాని అమ్మినట్లు సమాచారం. కానీ ఇప్పుడు ప్రభుత్వ అదేశాలతో ఏం జరుగుతుందో అని బయ్యర్లు భయపడుతున్నారట. అందులోనూ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ దీని మీద ఏదైనా కామెంట్ చేస్తే అన్నీ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. అందుకే అందరూ పవన్ స్పీచ్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
ఇకపోతే ఏపీలో టికెట్ ధరలు పెంచుకోడానికి.. ఐదో షోకు అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కాకపోతే దీనికి సంబంధించిన అధికారిక జీవో ఇంకా రాలేదు. 'భీమ్లా నాయక్' రిలీజ్ లోపు సవరణలతో కూడిన సరికొత్త జీవో వస్తుందని అందరూ భావించారు. ఇటీవల సర్కారు కమిటీ భేటీ అవ్వడంతో అంతా సవ్యంగానే జరుగుతోందని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే భీమ్లా విడుదల తేదీ లోపు జీవో రావడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.