Begin typing your search above and press return to search.
పవన్ కాటమరాయుడు..అతను శివరాయుడు
By: Tupaki Desk | 3 Oct 2016 11:30 AM GMTఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. షార్ట్ గా సాగిన తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని.. రెండో షెడ్యూల్ కోసం రామేశ్వరం వెళ్తోంది ‘కాటమరాయుడు’ టీం. తొలి షెడ్యూల్ జరిగే సమయానికి ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తమ్ముళ్లుగా కనిపించే నటుల విషయంలో క్లారిటీ లేదు. ఈ మధ్యే ఆ పాత్రలకు ముగ్గురు నటుల్ని కన్ఫమ్ చేశారు. వాళ్లే.. కమల్ కామరాజు.. అజయ్.. శివబాలాజీ. వీరిలో శివ బాలాజీ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఒకప్పుడు హీరోగానే కాక క్యారెక్టర్ రోల్స్ కూడా చేసి ఆకట్టుకున్న శివబాలాజీ.. ఉన్నట్లుండి లైమ్ లైట్లోంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు మళ్లీ ‘కాటమరాయుడు’తో వార్తల్లోకి వచ్చాడు.
ఇప్పటికే ‘అన్నవరం’ సినిమాలో పవన్ బావగా నటించిన శివబాలాజీ.. ఈసారి పవన్ తమ్ముడిగా నటిస్తున్నాడు. ఈ అవకాశం తనకు దక్కడం అదృష్టమని చెబుతూ.. తన పాత్ర గురించి సినిమా విశేషాల గురించి మాట్లాడాడు శివబాలాజీ. ‘‘కాటమరాయుడు సినిమా కోసమే నేను ప్రత్యేకంగా గడ్డం పెంచాను. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన.. ఆయన తమ్ముడిగా శివరాయుడు అనే పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర దక్కడం నా అదృష్టం. ఓ అద్భుతమైన కథతో ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది’’ అని శివబాలాజీ చెప్పాడు. ఈ నెల 5 నుంచి ఆరంభమయ్యే కొత్త షెడ్యూల్ కోసం రామేశ్వరం వెళ్తున్నట్లు శివబాలాజీ వెల్లడించాడు. ఈ సినిమా తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని అతనన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/