Begin typing your search above and press return to search.
బాహుబలిలా రావొద్దు మదర్ థెరిస్సాలాగా రండి!
By: Tupaki Desk | 27 Jun 2021 2:30 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల వార్ గురించి తెలిసిందే. ప్రకాష్ రాజ్ వర్గానికి వ్యతిరేకంగా వీకే నరేష్ వర్గం మీడియా సమావేశం హీటెక్కించింది. మా ప్రతిష్ఠ మసకబారిందంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్ నాగబాబు చేసిన వ్యాఖ్యను నరేష్ ఖండించారు. అలాగే మా గత అధ్యక్ష కార్యదర్శులు సరిగా పని చేయలేదన్న కామెంట్ కి కౌంటర్ వేసేందుకు నరేష్ సహా ప్రస్తుత కమిటీ సంయుక్త కార్యదర్శి శివబాలాజీ మీడియా సమావేశంలో మాట్లాడారు.
తాము పని చేయలేదనడం సరికాదని శివబాలాజీ అన్నారు. మాలో చేరగానే తొలిగా గొడవలు నేర్చుకున్నానని తెలిపిన ఆయన .. నరేష్ గారి పిలుపు మేరకు పోటీ చేసి గెలిచానని తెలిపారు. నేను జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన తరువాత తొలి మూడు నెలలు ఇక్కడ ఏం జరుగుతోంది అనేది చూశాను. మొదటగా నేర్చుకున్నది ఏంటి అంటే.. గొడవలే. ఇక్కడ అన్నీ విభేధాలు కనిపించాయి. అందుకే ఓటు వేసేప్పుడు ఒకే ప్యానెల్ ని ఎన్నుకోండి. రెండు వైపులా ఉంటే పనులు జరగవని శివబాలాజీ మా మెంబర్స్ తో అన్నారు.
అలాగే మా కోసం పని చేయడం నేర్చుకున్నానని ప్రతి సేవా రికార్డెడ్ గా ఉన్నాయని తెలిపారు. కరోనా కష్టంలో ఉన్నవారిని ఆదుకునేందుకు చాలా శ్రమించామని .. ఆస్పత్రి బెడ్ లు దొరక్కపోతే ఇప్పించామని శివబాలాజీ తెలిపారు.
అసలు మాలో పని చేయలేదని అంటే బాధగా ఉందని శివబాలాజీ అన్నారు. ఎన్నికలకు రెండు నెలల సమయం ఉంది.. స్నేహితుల నుంచి డొనేషన్స్ తీసుకుని మరీ మా మెంబర్స్ లో కష్టం ఉన్నవారికి సాయపడుతున్నామని తెలిపారు. ఇంకా పని చేస్తూనే ఉన్నామని అన్నారు. మాలో ఎవరైనా గెలవొచ్చు. పోటీకి వచ్చే ముందు బాహుబలిలా రావొద్దు మదర్ థెరిస్సాలాగా రండి అని అన్నారు. సేవ చేస్తే గుర్తింపు దక్కుతుందని అన్నారు.