Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉందని ఏది బ‌డితే అది చేయ‌కూడ‌దు..!

By:  Tupaki Desk   |   18 Feb 2022 6:49 AM GMT
ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉందని ఏది బ‌డితే అది చేయ‌కూడ‌దు..!
X
ముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి.. 2020లో 'చూసీ చూడంగానే' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి న‌ట‌న‌పై ఆస‌క్తితో సినిమారంగంలోకి అడుగుపెట్టిన శివ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నారు. ఇటీవల `గ‌మ‌నం` సినిమాలో చేసిన పాత్ర యువహీరోకి మ‌రింత‌గా పేరు తెచ్చిపెట్టింది. శివ నటించిన ‘మను చరిత్ర’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే నాని నిర్మాణంలో చేసిన ‘మీట్‌ క్యూట్‌’ అనే వెబ్‌ మూవీ కూడా రిలీజ్ రెడీ అయింది.

ఇప్పటి వరకూ తాను చేసిన సినిమాలు, పాత్రలు మంచి గుర్తింపుని, అనుభవాన్ని అందించాయని.. ఇక మీదట కూడా కథాబలం ఉన్న సినిమాలే చేస్తానని శివ చెబుతున్నారు. కమర్షియల్‌ సినిమాలు చేయడం కంటే అర్థవంతమైన కథలు ఎంచుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానని యువ హీరో అంటున్నారు. ఇవాళ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 18) శివ కందుకూరి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆసక్తికరమైన విష‌యాలను పంచుకున్నారు.

- సినిమా చేయాలంటే క‌థ‌, క్యారక్టర్ లో ప‌ర్‌ప‌స్ వుండేలా చూస్తాను. అలాగే క‌థ‌ల‌ను ఎంపిక చేసుకున్నా. `గ‌మ‌నం` అలా చేసిందే. ఆ సినిమా ఓటీటీలో విడుద‌లై అద్భుత‌మైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రేక్ష‌కులు ఆద‌రించారు. దాన్ని బ‌ట్టి నేను ఎంచుకున్న విధానం క‌రెక్ట్ అనిపించింది.

- నేను కమర్షియల్ సబ్జెక్ట్‌ లను మాత్రమే ఎంచుకోవాలని కాదు. దాని నుంచి బ‌ట‌య‌కు వ‌చ్చి అర్థ‌వంతమైన సినిమాలే చేయాలన్నది నా నమ్మకం. నేను నా నమ్మకాలకు వ్యతిరేకంగా వెళ్లలేను.

- కనీసం నా కెరీర్ తొలిదశలో అయినా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు చేసినా ఆర్గానిక్ సినిమాలే చేస్తాను. 'మను చరిత్ర' ఆర్గానిక్‌ గా ఉండబోతోంది. క్యారెక్టర్ జర్నీ- స్టోరీ రియలిస్టిక్ గా ఉంటుంది.

- నేను ఏ పాత్ర చేసినా పాత్రకు కనెక్ట్ అవ్వాలి. స్క్రిప్ట్‌ లో నాకు నమ్మకం ఉండాలి. అల్లు అర్జున్ గారు క్యారెక్టర్‌ ని నమ్మారు కాబట్టి 'పుష్ప' మెప్పించింది. ఆ స్థాయి నమ్మకం లేకుంటే ప్రేక్షకులు ఇంతగా ఆదరించి ఉండేవారు కాదు. ఇది అన్ని రకాల సినిమాలకూ వర్తిస్తుంది.

- ఏదో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ వుంది కదాని ఏది బ‌డితే అది చేయ‌కూడ‌దు. ప్రేక్ష‌కులు మ‌న‌ల్ని నిశితంగా గ‌మ‌నిస్తూనేవుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ వ‌చ్చాక స్పానిష్‌ తోపాటు ప‌లు దేశాల సినిమాల‌ను చూసి అన‌లైజ్ చేస్తున్నారు. అందుకే న‌టులుగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

- వచ్చే ఐదేళ్లలో నేను కొన్ని సినిమాలు మాత్రమే చేయగలను. వాల్యూమ్ పట్టింపు లేదు. మా నాన్న సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నారు. సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం నాపై ఆధారపడి ఉంటుంది. నాన్న‌గారు కేవలం ఏదైనా సలహా మాత్రమే ఇస్తాడు. చాలా సార్లు నా అభిప్రాయాలకే పెద్ద పీట వేస్తారు.

- కెరీర్ మొద‌టిలోనే `గ‌మ‌నం` ద్వారా చారు హాసన్ సర్ - ఇళ‌య‌రాజా సంగీతం - సినిమాటోగ్రాఫర్ విఎస్ జ్ఞానశేఖర్ వంటి సీనియర్లను గమనించి నేను చాలా నేర్చుకున్నాను. నా రెండో సినిమా ‘గమనం’లో ప్రతిభావంతులైన వారితో కలిసి పని చేశాను. క‌థ విన్న‌ప్పుడే నా గ్రాడ్ ఫాద‌ర్‌ తో వున్న ఎటాచ్‌మెంట్‌ చారు హాస‌న్‌ తో క‌నెక్ట్ అయింది. న‌ట‌న‌కూ స్కోప్ వున్న చిత్ర‌మ‌ది. డెడికేష‌న్ వారి నుంచి నేర్చుకున్నా.

- ప్ర‌స్తుతం ఇండస్ట్రీలో యూత్ హీరోల‌తో భారీ పోటీ ఉంటుంది. అదీ పాజిటివ్ కోణంలోనే వుంది. ప్ర‌తి ఒక్క‌రూ క‌థాపరంగా విభిన్నంగా ఏదైనా చేయాలని కోరుకుంటారు.

- పెద్ద చిత్రాల‌తో పాటుగా తక్కువ బడ్జెట్‌లతో రూపొందించబడిన చిత్రాలకు OTT ఒక ఫ్లాట్‌ ఫార‌మ్‌ గా మారింది. అందులో కంటెంట్-ఆధారిత కథనాలను చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంది. కొత్త వారికి ఇది చాలా ఆరోగ్యకరమైన విష‌యం.

- కొత్త సినిమాల‌ప‌రంగా చూస్తే, 'మను చరిత్ర' చిత్రీకరణ పూర్తి చేసుకుంది. క్రైమ్ థ్రిల్లర్ కూడా చేస్తున్నాను. నూతన దర్శకుడు పురుషోత్తం రాజ్ దీనికి దర్శకుడు. నేచురల్ స్టార్ నాని గారు నిర్మిస్తున్న 'మీట్ క్యూట్ వెబ్ ఫిలింలో చేస్తున్నాను. మ‌రో వెబ్ సిరీస్ కూడా చ‌ర్చ‌ల్లో వుంది. ఓటీటీ అనేది పాండెమిక్ త‌ర్వాత ప్రేక్ష‌కుల‌కు మంచి వినోద సాధ‌నంగా మారిపోయింది. ఏదైనా థియేట‌ర్‌ ను బీట్ చేయ‌లేదు.

- నా బ‌ర్ద్ డే రిజ‌ల్యూష‌న్ పెద్ద‌గా లేవు. ఆర్గానిక్ స్టోరీలు చెప్పాల‌నుకుంటున్నాను. క‌రోనా అనే గ్యాప్ కూడా క‌థ‌లు ఎంచుకునే విధానంలో మార్పును ప్ర‌తి ఆర్టిస్టులో క‌ల‌గ‌జేసిందని చెప్ప‌గ‌ల‌ను. 'మను చ‌రిత్ర' సినిమాని రాబోయే రెండు నెల‌లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నాము.