Begin typing your search above and press return to search.
స్టార్ హీరో తండ్రిపై తీవ్ర విమర్శలు
By: Tupaki Desk | 30 Oct 2018 10:53 AM GMTతమిళ స్టార్ హీరోలైన సూర్య, కార్తీల తండ్రి, నటుడు అయిన శివకుమార్ తాజాగా ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన ఒక వ్యక్తి మొబైల్ ను లాక్కుని విసరగొట్టిన శివకుమార్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇష్టం లేకుంటే వద్దని చెప్పాలి కాని, అభిమానంతో సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన వ్యక్తి నుండి మొబైల్ లాక్కుని పగుల గొట్టడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మదురైలో ఒక ప్రారంభోత్సవంకు శివ కుమార్ వెళ్లాడు. ప్రారంభోత్సవం సమయంలో చాలా మంది సెల్ఫీలు తీసుకునేందుకు మీదకు మీదకు వచ్చారు. దాంతో అసహనంతో శివకుమార్ ఒక మొబైల్ ను లాగి కింద పడేయడం జరిగింది. తాను అలా చేయడంను శివ కుమార్ సమర్ధించుకుంటున్నాడు. సెల్ఫీల పేరుతో సెలబ్రెటీలను ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని, అక్కడ 300 మంది ఉన్నారు. అందులో 25 మంది సెల్ఫీ అంటూ మీదకు వచ్చారు. దాంతో నాకు భద్రత కల్పించిన వారు కూడా ఇబ్బంది పడ్డారు. అందుకే ఆ సమయంలో మొబైల్ ఎత్తి వేసినట్లుగా శివకుమార్ చెప్పుకొచ్చారు.
శివకుమార్ మొబైల్ ఎత్తి వేసిన దృష్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సెల్ఫీు అనేవి సన్నిహితులతో ఏదైనా ప్రదేశంకు వెళ్లినప్పుడు గుర్తుండి పోయేలా తీసుకుంటారు. కాని సెలబ్రెటీలు ఎవరో తెలియని వారితో ఎందుకు సెల్ఫీలు దిగాలి. సెలబ్రెటీలకు వ్యక్తిగత జీవితం ఉండదా, సెలబ్రెటీలు ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీసా అంటూ శివకుమార్ ప్రశ్నించాడు. శివకుమార్ వివరణకు నెటిజన్స్ సంతృప్తి చెందడం లేదు.