Begin typing your search above and press return to search.

ఉప్పల్ బోనాలకు శివగామి వచ్చేసింది

By:  Tupaki Desk   |   28 July 2017 5:11 AM GMT
ఉప్పల్ బోనాలకు శివగామి వచ్చేసింది
X
సినిమా అంటే మన దేశంలో ఒక జాతి కొన్ని కోట్ల మంది తమ రోజూవారి జీవితంలో నిత్యం తలుచుకునే ఒక విషయం. సినిమాలో ఉన్న పాత్రలను తమ వాళ్ళే అన్నంతగా ఆరాదిస్తారు. వాళ్ళకి నచ్చితే ఆ పాత్రను ఎప్పటికీ మరిచిపోరు వాళ్ళు చేసే ప్రతి పనిలో దాన్ని ప్రతిబింబించే లా చూసుకుంటారు. అందుకే కొన్ని సినిమాల్లోని పాత్రలను పోస్టర్లుగా విగ్రహాలుగా బొమ్మలుగా కూడా మారిపోతుంటాయి.

మన దేశంలో ఈ ఏడాది వచ్చిన సినిమాలలో అందరికి నచ్చిన సినిమా తెలుగు సినిమా గతిని దిశను మార్చిన సినిమా బాహుబలి ఎంతటి ఘనవిజయం పొందిందో మనకు తెలుసు. ఆ సినిమాలోని పాత్రలు కూడా అంతే పాపులర్ అయ్యియి. ముఖ్యంగా బాహుబలి పాత్ర గురించి చెప్పనవసరం లేదు అనుకోండి. అలాగే బాహుబలి తల్లి శివగామి పాత్ర కూడా అంతే ఫేమస్ అయ్యింది. ఈ పాత్రలో రమ్యకృష్ణ నటనకు అందరూ ఫిదా అయ్యారు అనే చెప్పాలి. శివగామి పాత్ర ఎంతలా జనాలుకు చేరింది అంటే మన గ్రామ దేవత పండుగలకు ముందు వేషాలు వేసి ఊరేగిస్తారు కదా కొన్ని పురాణ పాత్రలును.. అలాగే శివగామిని కూడా ఒక బొమ్మ రూపంలో తయారుచేసి ఉప్పల్ బోనాలు పండుగలో ఊరేగించారు. బాహుబలి2 సినిమాలో ప్రజలు కోసం తలపై నిప్పుల కుంపటి పెట్టుకొని ఉట్టిపాదాలుతో రమ్యకృష్ణ నడిచి వచ్చే సన్నివేశం గుర్తిండి ఉండే ఉంటుంది కదా మీకు. అలానే ఇక్కడ వీదులలో కూడ శివగామి నడిచి వచ్చేసింది.

ఈ విగ్రహం చూస్తే.. నిండైన చీర కట్టులో తీక్షణత నిండిన కళ్ల తో ఒక చేతితో కొంగు మరో చేత్తో కర్ర పట్టుకొని వెనకాల ఆమె సైన్యంతో అచ్చం సినిమాలో శివగామిలానే ఉందే అంటున్నారు అంతా అక్కడ ఉన్నవాళ్ళు. ఇక్కడ ఉన్న ఫోటో చూస్తే మీరు కూడా ఆ అవును అనేస్తారు. అది సంగతి.. జై మాహిష్మతి!!