Begin typing your search above and press return to search.
నా ఓటమి కోసం కుట్ర జరిగింది?
By: Tupaki Desk | 19 March 2019 11:13 AM GMTఇటీవల "మా"కు జరిగిన ఎన్నికల్లో గెలిచిన వర్గానికి.. ఓడిన వర్గానికి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హాట్ హాట్ గా మారిన పరిస్థితి మరింత ముదిరిపోయేలా ఓడిన శివాజీరాజా మరిన్ని ఆరోపణలే కాదు.. తానుఓడిపోవటానికి కుట్ర జరిగిందని ఆరోపించారు. అంతేకాదు.. మీడియా ముందుకు వచ్చి నరేష్ చేసిన ఆరోపణల్ని ఆయన కొట్టి పారేయటమే కాదు.. సరికొత్త సవాళ్లు విసిరారు.
మాకు కొత్త భవనం.. ఓల్డేజ్ భవనాన్ని కట్టిస్తానని మాట ఇవ్వటమే తాను చేసిన తప్పు అని.. తాను ఆ పని చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే తనను కుట్రకు గురి చేసి మరీ ఓడించినట్లుగా శివాజీరాజా ఆరోపించారు. శివాజీ రాజా తీరును తప్పు పడుతూ నటుడు నరేష్ ఇటీవల పెట్టిన మీడియా సమావేశం..శివాజీ రాజాకు వార్నింగ్ గా పలువురు చర్చించుకున్నారు. ఇలాంటి వేళ.. శివాజీరాజా తాజాగాపెట్టిన మీడియా మీటింగ్ ఈ వివాదాన్ని మరింత రాజేసేలా చేసిందని చెప్పాలి.
మీడియా సమావేశంలో శివాజీ రాజా ప్రస్తావించిన కొన్ని ప్రధానాంశాల్ని ఆయన మాటల్లోనే చదివితే..
= నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం ఓల్డేజ్ హోమ్ కట్టిస్తానని చెప్పడమే. నా లాంటి లేనోడు.. భీమవరం నుంచి వచ్చి ఇక్కడ ఓల్డేజ్ హోం - ‘మా' బిల్డింగ్ కట్టేస్తే పేరంతా వీడికే వచ్చేస్తుంది... ఇక మా సంగతి ఏమిటి? అని కొందరు పన్నిన కుట్రలో బలయ్యా.
= నేను గతంలో ‘మా' ఎన్నికల్లో పెద్ద పెద్ద వారిపై నెగ్గాను. ఎప్పుడూ తల ఎగరేయలేదు. ఏం చెప్పానో అవి చేసుకుంటూ వెళ్లాతాను - వాటి గురించే మాట్లాడతాను. అంతే కానీ ఎవరికీ వార్నింగులు ఇవ్వలేదు.
= వార్నింగులు ఇవ్వడానికి మనం ఏమైనా దేశానికి ప్రధాన మంత్రులుగా పదవి చేపట్టమా? పదవి వస్తే అణకువగా ఉండాలి. అప్పుడే పేరు వస్తుంది. మీరు ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఏం చేస్తారో?
= గతంలో మహేష్ బాబు దగ్గరకు వెళితే ప్రోగ్రాం చేస్తామన్నారు. తర్వాత అది ఎందుకు చెడిపోయిందో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. రావాల్సిన 2 కోట్లు రాలేదు.
= తర్వాత చిరంజీవిగారి దగ్గరకు వెళ్లి మహేష్ బాబు గారితో ప్రోగ్రాం చేస్తాను అని నరేష్ చెప్పారు. నాలుగు నెలలైనా ప్రోగ్రాం చేయలేదు. మీడియా ఎదురుగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంకో మూడు నెలల సమయం ఇస్తా. మహేష్ బాబును అమెరికా తీసుకెళతారో మరో దేశానికి వెళ్లి కార్యక్రమం చేస్తారో మీ ఇష్టం... రూ. 2 కోట్లు ‘మా'కు తీసుకురండి. అపుడు నేనే వచ్చి శబాష్ అని మీకు దండవేస్తా...
= నాకు ఈ పేరు వద్దు ఏమీ వద్దు. ఎవరు ‘మా' బిల్డింగ్ - ఓల్డేజ్ హోం ఎవరు కడితే వారే హీరో. మీరే కట్టండి. అది మంచి పని - పది మందికి పనికొచ్చేది. ఎవరు కడితే ఏముంది? అది శివాజీ రాజా చేసిన - మరెవరు చేసినా ఒకటే. ‘మా'లో సభ్యులుగా ఉన్న పేద ఆర్టిస్టులకు న్యాయం జరుగాలని మాత్రమే నేను కోరుకుంటాను.