Begin typing your search above and press return to search.
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న శివాజీరాజా!
By: Tupaki Desk | 19 March 2019 9:31 AM GMTఇటీవల మా అసోసియేషన్ కు జరిగిన ఎన్నికలు ఎంత హాట్ హాట్ గా జరిగాయో తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మా అసోసియేషన్ ఎన్నికలు పోటాపోటీగా జరగటమే కాదు.. ఎన్నికల అనంతరం తామంతా ఒకటేనని చెప్పినా.. అలాంటి పరిస్థితి లేకపోవటం.. రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం జరగటం తెలిసిందే.
ఎన్నికల్లో ఓటమి చెందిన శివాజీరాజా తన పదవిని వదిలిపెట్టటం లేదని.. తన పదవీ కాలం పూర్తి అయ్యే వరకూ ఉంటానని చెప్పారంటూ నరేశ్ వర్గం ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం సంచలనంగా మారింది. తాము ప్రమాణస్వీకారం చేస్తే.. తాను కోర్టుకు వెళతానంటూ శివాజీరాజా చెబుతున్నారని.. సినిమా పెద్దల వద్ద ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్లుగా నరేశ్ చెప్పారు.
ఇదంతా జరిగి దాదాపు వారం పూర్తి అవుతున్న వేళ.. ఈ రోజు శివాజీ రాజా హటాత్తుగా తెర మీదకు వచ్చారు. ప్రెస్ తో మాట్లాడిన ఆయన.. తాను కోర్టుకు వెళతానని చెప్పలేదన్న ఆయన.. తాను గెలిచిన సందర్భంలోనూ పదవీ కాలం పూర్తి అయ్యాకే ప్రమాణస్వీకారాన్ని చేసిన వైనాన్ని గుర్తు చేశారు. తన పరువు తీసే విధంగా నరేశ్ అండ్ కో మాట్లాడినట్లుగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తనపై చేసిన విమర్శలు.. ఆరోపణలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎన్నికల సందర్భంగా తనకు ఎదురైన ఒక అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన శివాజీ రాజా తానునాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించి సంచలనంగా మారారు.
తనకు నాగబాబు మంచి మిత్రుడని.. ఎన్నో ఏళ్లుగా తమ మధ్య స్నేహం ఉందని.. అలాంటి నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి నరేశ్ వర్గానికి మద్దతు తెలిపిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. నాగబాబు నాకు ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహితుడు. ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారు. త్వరలోనే ఆయనకు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించిన నాటి నుంచి ఈ పదం బాగా పాపులర్ కావటం.. రిటార్ట్ తీర్చుకోవటానికి.. బదులు తీర్చుకోవటానికి రిటర్న్ గిఫ్ట్ అన్న పదాన్ని వాడటం అంతకంతకూ పెరుగుతోంది.