Begin typing your search above and press return to search.
ప్రిన్స్ కొట్టిన దెబ్బ.. డబ్బు వెనక్కిచ్చిన హీరో?
By: Tupaki Desk | 4 Jan 2023 1:30 PM GMTకోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో ఒక్కసారిగా ఊహించని స్థాయిలో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు శివ కార్తికేయన్. ఒక మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజ్ షోలు చేసుకుంటూ ఆ తర్వాత యాంకర్ గా కొన్నాళ్ళు కొనసాగిన శివ కార్తికేయన్ కొంతమంది స్టార్ హీరోల సినిమాలలో కూడా సైడ్ క్యారెక్టర్స్ లో నటించాడు. ఇక ఇప్పుడు అతను ఏకంగా కథానాయకుడి పాత్రలు చేసుకుంటూ మంచి పారితోషికాన్ని కూడా అందుకుంటున్నాడు.
అతను నటించిన డాన్ డాక్టర్ సినిమాలు రెండు కూడా 100 కోట్ల బిజినెస్ చేయడం విశేషం అనే చెప్పాలి. ఇక శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమాతో కూడా తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నాడు. ఆ సినిమాను జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యింది.
ముఖ్యంగా తమిళంలో అయితే ఆడియన్స్ ప్రిన్స్ సినిమా కామెడీని పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు. టూ మచ్ కమర్షియల్ గా ఉందని అసలు జోక్స్ ఏమాత్రం బాగోలేవు అని ట్రోల్స్ కూడా చేశారు. అయితే సినిమాను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం చాలా దారుణంగా నష్టపోవాల్సి వచ్చింది.
ఈ క్రమంలో హీరో శివకార్తికేయన్ భారీ స్థాయిలో నష్టపోయిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కు తన పారితోషికం నుంచి 6 కోట్ల వరకు వెనక్కి తిరిగి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కెరీర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచి విషయమే అని చెప్పవచ్చు. ఇక అతనికి ఇప్పుడు తెలుగులో కూడా ఒక మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. అలాగే తెలుగు దర్శకులు కూడా అతనితో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు.
ప్రస్తుతమైతే ఈ హీరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. అలాగే ఆమధ్య మరో తెలుగు దర్శకుడు తో కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ వచ్చింది. మరి శివ కార్తికేయన్ తదుపరి సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.