Begin typing your search above and press return to search.
`ఇండియన్ సినిమా డాన్` ఎవరో తెలుసా?
By: Tupaki Desk | 1 Jun 2022 2:30 AM GMTడాన్ సినిమాతో హిట్టు కొట్టాడు శివకార్తికేయన్. ఈ చిత్రం తమిళంలో బాగానే ఆడింది. ఇక ఈ మూవీ ప్రివ్యూని రజనీకాంత్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. శివకార్తికేయన్ డాన్ ను తన కెరీర్ లో అతిపెద్ద విజయాలలో ఒకటిగా భావించేంతగా కీర్తిని దక్కించుకున్నాడు. అతను ఇప్పటికే 2022లో బెస్ట్ కెరీర్ తో ఆకట్టుకున్నాడు. తమిళనాడులో లక్షలాదిగా అభిమానులను సంపాదించిన అతడికి డాన్ ఫలితం మరింతగా కలిసి రానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ పై తనకున్న ప్రేమ గురించి శివకార్తికేయన్ ఎప్పుడూ బహిరంగ వేదికలపై చెబుతూనే ఉంటాడు. తలైవార్ ని మరోసారి కలిసే అవకాశం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది ఈరోజు సాధ్యమైంది.
అందుకే ఇప్పుడు రజనీకాంత్ ను కలిసిన తర్వాత శివకార్తికేయన్ హృదయాన్ని కదిలించే నోట్ ను రాశారు. సూపర్ స్టార్ తో తన ప్రత్యేక క్షణం గురించి అభిమానులకు షేర్ చేసారు శివకార్తికేయన్. అతను రజనీకాంత్ తో పోజులిచ్చిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసారు. అరుదైన ఈ అనుభవంపై హృదయపూర్వక నోట్ ని కూడా రాశాడు, ``భారతీయ సినిమా డాన్ తో ?... ఆ 60 నిమిషాలు జీవితకాల జ్ఞాపకంగా మిగిలిపోతాయి. విలువైన సమయాన్ని వెచ్చించినందుకు తలైవాకు ధన్యవాదాలు #డాన్ కి విలువైన అభినందనలు..!`` అని ఎమోషనల్ నోట్ ను రాసారు.
తాజా కథనాల ప్రకారం.. తలైవర్ 169లో శివకార్తికేయన్ కీలక పాత్రలో కనిపించవచ్చని పుకార్లు వినిపించాయి. అయితే దానిపై ఎటువంటి అధికారిక నిర్ధారణ లేదు. అయితే రీసెంట్ గా వచ్చిన ఫోటో చూసి ఈ రూమర్ నిజమేనని అభిమానులు భావిస్తున్నారు. శివకార్తికేయన్ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. `మెరీనా` చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టాడు. అతని ఇటీవల విడుదలైన డాక్టర్ - డాన్ రెండూ రూ. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసాయి. మరోవైపు తలైవర్ 169 లో అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ఈ చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ తో అతని మొదటి అరుదైన అవకాశం. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శివకార్తికేయన్ హిట్ చిత్రం `డాక్టర్`కి నెల్సన్ దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద బీస్ట్ పరాజయం తర్వాత రజనీతో చిత్రం ఆగిపోయిందని పుకారు వచ్చినా రజనీకాంత్ - నెల్సన్ ఓ ప్రకటనలో దానిపై క్లారిటీ ఇచ్చారు. తమ ప్రతిష్ఠాత్మక చిత్రం త్వరలో సెట్స్ కెళుతుందని తెలిపారు.
తెలుగులో వర్కవుట్ కాలేదు!
శివకార్తికేయన్ నటించిన డాన్ చిత్రం ఇటీవలే విడుదలై తమిళ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. తెలుగులో అంతంత మాత్రమే అయినా కానీ శివకార్తికేయన్ నటనకు పేరొచ్చింది. ఇకపోతే శివకార్తికేయన్ హైదరాబాద్ థియేటర్ విజిట్స్ తో హైప్ పెంచే ప్రయత్నం చేసాడు కానీ అది ఏమంత వర్కవుట్ కాలేదు. శివకార్తికేయన్ కి ఇంకా తెలుగు మార్కెట్ క్రియేట్ కాలేదు. అది జరగాలంటే అతడు ఇంకా చాలా పెద్ద మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది.