Begin typing your search above and press return to search.
యశోదని వదలనంటోన్న నిర్మాత!
By: Tupaki Desk | 18 Nov 2022 4:43 AM GMTసమంత ప్రధాన పాత్రలో తెరకెకెక్కిన 'యశోద' ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా డివైడ్ టాక్ తో రన్నింగ్ లో ఉంది. ఇందులో కొన్ని పాత్రలు ప్రత్యేకంగా హైలైట్ అయ్యాయి. సినిమా వసూళ్ల పరంగానూ పర్వాలేదనిపిస్తుంది. దీంతో యూనిట్ విజయోత్సవ సభని నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివలెకం కృష్ణ యశోద గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు.
యశోద సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. 'యశోద -2 విషయంలో మా దగ్గర ఓ ఆలోచన ఉంది. అంతే కాదు మూడవ భాగానికి ఓ లీడ్ ఉంది. సమంత పూర్తి ఆరోగ్యంగా తిరిగి వచ్చిన తర్వాత ఆమెతో చర్చిస్తాం. ఆమె ఒప్పుకుంటే వెంటనే సీక్వెల్ పట్టాలెక్కిస్తాం. అలాగే వరలక్ష్మి పాత్ర కూడా యధావిధిగా కొనసాగిస్తాం. ఉన్ని ముంకుదన్ రోల్ కి ఆస్కారం ఉందని దర్శక నిర్మాతలు తెలిపారు.
దీన్ని బట్టి య శోదని ఓ ప్రాంచైజీలో మలచబోతున్నట్లు తెలుస్తోంది. హిట్ సినిమాలు ప్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెఇసిందే. ఇటీవలి కాలంలో ఆ ఒరవడి మరింత పెరిగింది. ఈ నేపథ్యలో దర్శక-నిర్మాతలు యశోదని వివిధ భాగాలుగా ప్రేకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ సెక్షన్ ఆడియన్స్ ప్లాప్ సినిమా కి ప్రాంచైజీ ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రిలీజ్ అయిన యశోదకి బూస్టింగ్ ఇవ్వడం కోసం ఇలా సీక్వెల్స్..ప్రాంచైజీలు అంటూ కహానీలు మొదలు పెట్టినట్లు విమర్శిస్తున్నారు. యశోద ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదని..యూటర్న్ తరహాలోనే యావరేజ్ గా ఆడిందని అభిప్రాయపడుతున్నారు. రెండు..మూడు పార్టులు పబ్లిసిటీ స్టంట్ అని గుసాయిస్తున్నారు. మరి ఇది స్టంట్ నా? నిజంగానే చేసి చూపిస్తారా? అన్నది చూడాలి.
ఒక వేళ సమంతతో సీక్వెల్స్ చేయాలన్నా? ఇప్పట్లో కుదిరే సన్నివేశం కనిపించలేదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదు. బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు సహ వెబ్ సిరీస్ లు కమిట్ అయింది. అనారోగ్యం నుంచి కోలుకున్న వెంటనే ఆ కమిట్ మెంట్లు పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత సౌత్ లో కొన్ని సినిమాలు ఒప్పుకుంది. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. అలాగే భవిష్యత్ ని బాలీవుడ్ లో ప్లాన్ చేసుకుంటుంది. మరి ఇలాంటి ప్లానింగ్ తో ఉన్న సమంత యశోదగా మళ్లీ వస్తుందా? అన్నది ఆశ్చర్యకరమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.