Begin typing your search above and press return to search.

ఎప్పటికైనా తెర మీద పాడేయాలి

By:  Tupaki Desk   |   5 April 2018 5:51 AM GMT
ఎప్పటికైనా తెర మీద పాడేయాలి
X
టాలీవుడ్ హీరోల కూతుళ్లు కూడా నటీగా చేయవచ్చు అనే కొత్త తరహా రూల్ ని ఈ జనరేషన్ డాటర్స్ నిరూపించడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా రాజశేఖర్ కూతురు శివాని గ్లామర్ బ్యూటీకి ఏ మాత్రం తీసిపోకుండా నటించడానికి సిద్ధమైంది. సినిమాలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఒక్కటే టార్గెట్ గా పెట్టుకుంది. ప్రస్తుతం కొంత మంది హీరోయిన్స్ ఎలాంటి పాత్రల్లో అయినా సెట్ అయిపోతున్నారు.

ముఖ్యంగా సమంత ఎలాంటి పాత్ర అయినా చేసేస్తోంది. రంగస్థలం అందుకు ఒక ఉదాహరణ. దీంతో ఆమెనే స్ఫూర్తిగా తీసుకుంటున్నానని శివాని చెబుతోంది. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఈ యువ నటి కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ 2 స్టేట్స్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అదే వీరు చేస్తోన్న సినిమా. అయితే శివాని మనసులో ఒక్క హీరోయిన్ అవ్వాలనే కొరికే లేదట.

తనలో ఇంకో కోరిక కూడా ఉన్నట్లు అది ఎప్పటికైనా నెరవేర్చుకోవాలని సాధన చేస్తోంది. ఎప్పటికైనా సినిమాల్లో పాడాలని క్లాసికల్ సంగీతంపై దృష్టి పెట్టింది. శివానికి చిన్నపాటి నుంచే సంగీతం అంటే చాలా ఇష్టమట. దీంతో ఆ విధంగాను మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకోవాలని అమ్మడు చాలా ఆశపడుతోంది, మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.