Begin typing your search above and press return to search.
రెండు నెలలు కబురందక టెన్షన్!
By: Tupaki Desk | 7 July 2019 5:30 PM GMT``ఊహ తెలిసినప్పటి నుంచి సినిమానే జీవితం. స్కూల్ కంటే షూటింగుల్లోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. నేను హీరోయిన్ అవుతానంటే ఎవరూ సర్ ప్రైజ్ కాలేదు`` అని తెలిపింది శివాత్మిక రాజశేఖర్. జీవిత- రాజశేఖర్ ల రెండో తనయ శివాత్మిక దొరసాని చిత్రంతో లక్ చెక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మహేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రంగా పాపులారిటీ దక్కించుకుంది. ఈ చిత్రంతోనే ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్నారు. జూలై 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.
రిలీజ్ ప్రమోషన్స్ లో ఆడిషన్స్ ప్రాసెస్ గురించి మాట్లాడిన శివాత్మిక పలు ఆసక్తికర సంగతుల్ని తెలిపారు. శివాత్మిక మాట్లాడుతూ.. ``దొరసాని` రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పుడు మాత్రం ఇంట్లో సందండి ఎక్కువవుతోంది. కథ వినగానే పాత్ర నచ్చింది. నా పాత్రను దర్శకుడు మహేంద్ర వినిపించిన విధానం మైమరిపించింది. అటుపై నన్ను ఆనంద్ ని ఒకేసారి ఆడిషన్స్ చేసారు. ఆడిషన్స్ కూడా అయ్యాక రెండు నెలలు నాకు ఎలాంటి కబురు అందలేదు. ఆ టైం లో ఆ పాత్ర కోసం నేను ఎంతో ఆసక్తిగా కాస్తంత టెన్షన్ గానే ఎదురు చూసాను. నేనే అని తెలిసాక చాలా ఎగ్జైట్ అయ్యాను`` అని అన్నారు.
తొలి ప్రయత్నమే పీరియాడిక్ ప్రేమకథలో నటించే అవకాశం దక్కింది. దొరసాని ప్రేమకథలో స్వచ్ఛత నన్ను బాగా ఆకర్షించింది. అందుకే ఎంతో ఇష్టపడి చేసాను. సంజయ్ లీలా భన్సాలి అభిమానిగా నేను ఇలాంటి హిస్టారికల్ పీరియాడిక్ కథతోనే పరిచయం అవ్వడం ఆనందాన్నిస్తోంది. నా దర్శకుడు నన్ను చూసి ఆ పాత్రకు ఎంచుకున్నారని తను చెప్పిన దానిని బట్టి అర్థమైంది. నేను ఒక డైలాగ్ చెప్పకుండానే నన్ను సెలెక్ట్ చేశానని షూటింగ్ అయ్యాక చెప్పారు. తొలి సీన్ తీసేప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. కానీ దర్శకుడు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ముందుకు నడిపించింది`` అని శివాత్మిక వెల్లడించారు.