Begin typing your search above and press return to search.

అర‌డ‌జ‌ను రిలీజ్ కి రెడీ.. క్లారిటీ ఏది భీమ్లా?

By:  Tupaki Desk   |   1 Feb 2022 5:30 AM GMT
అర‌డ‌జ‌ను రిలీజ్ కి  రెడీ.. క్లారిటీ ఏది భీమ్లా?
X
క‌రోనా మ‌హ‌మ్మారీ ప్ర‌తిదీ మార్చేసింది. తొలి రెండు వేవ్ ల‌ను మించి ఇటీవ‌ల థ‌ర్డ్ వేవ్ లో కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే మ‌ర‌ణ భ‌యం లేక‌పోవ‌డం.. వ్యాక్సినేష‌న్ భ‌రోసాతో ఈసారి ప్ర‌జ‌లు య‌థేచ్ఛ‌గా ఆరుబ‌య‌ట తిరిగేస్తున్నారు. ఇక సినిమాల రిలీజ్ ల‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌నే భ‌రోసా క‌నిపిస్తోంది. దీంతో వ‌రుస‌గా టాలీవుడ్ నుంచి రిలీజ్ తేదీల్ని ప్ర‌క‌టించారు. రానున్న మ‌రో రెండు నెలల్లో భారీ చిత్రాల‌న్నీ రిలీజ్ కానున్నాయి.

వీటిలో RRR మార్చి 25న‌... రాధేశ్యామ్ మార్చి 11న రానున్నాయి. ఆచార్య ఏప్రిల్ 1 రేసు నుంచి వైదొల‌గి ఏప్రిల్ 29న వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. ఇక ఆర్.ఆర్.ఆర్ .. ఆచార్య మ‌ధ్య‌లో కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. సర్కార్ వారి పాట.. ఎఫ్ 3 చిత్రాలు ఏప్రిల్ 28న విడుల‌య్యేందుకు ఆస్కారం ఉంద‌ని తెలిసింది. RRR తేదీపై క్లారిటీ రాగానే ఇత‌ర సినిమాల రిలీజ్ తేదీల‌పైనా స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. అయితే భీమ్లా నాయక్ నిర్మాత‌లు రెండు తేదీల్ని ప్ర‌క‌టించ‌డంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 అని వ‌స్తున్నామ‌ని నిర్మాత నాగ‌ వంశీ ధృవీకరించారు.

అయితే దీనికి కార‌ణం క‌రోనా మహమ్మారి కానేకాదు.. టికెట్ ధ‌ర‌ల‌పై ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఫిబ్ర‌వ‌రి ఆరంభంలో క్లారిటీ ఇచ్చేస్తే వెంట‌నే వ‌చ్చే అవ‌కాశం ఉంది. లేదంటే కాస్త దూరం జ‌రిగి తాపీగా రావాల‌నేది ప్లాన్ అని విశ్లేషిస్తున్నారు. దేనికైనా వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం డిసైడ్ చేయాల్సి ఉంటుంది.

వ‌కీల్ సాబ్ త‌ర‌హాలోనే భీమ్లా నాయ‌క్ ని ఏపీ సీఎం జ‌గ‌న్ టార్గెట్ చేయ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారంటూ విశ్లేషిస్తున్నారు. అందుకే టైమింగ్ చూసి రిలీజ్ చేయాల‌న్న‌ది భీమ్లా నిర్మాత‌ల ఆలోచ‌న‌. అయితే ఒక‌ట్రెండు వారాల్లోనే భీమ్లా నాయ‌క్ రాక‌పై నిర్మాత‌లు పూర్తి స్ప‌ష్ఠ‌త‌నిస్తారనే అంతా భావిస్తున్నారు. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న అంటూ ప్ర‌క‌టించిన ఆర్.ఆర్.ఆర్ మార్చి 25న వ‌చ్చేయ‌డం ఇత‌రుల‌కు వ‌రం అని అంగీక‌రించాలి. అర‌డ‌జ‌ను రిలీజ్ లు ఆల్మోస్ట్ ఫిక్స‌యిపోయాయి. ఇక భీమ్లా నాయ‌క్ తేదీపైనే అభిమానుల‌కు క్లారిటీ రావాల్సి ఉంటుంది.