Begin typing your search above and press return to search.
'నేనింతే' అని ప్రూవ్ చేసుకోవాల్సిందే
By: Tupaki Desk | 19 March 2015 5:30 AM GMTలైఫ్ ఈజ్ లైట్స్ కెమెరా యాక్షన్!! ఇలా ఎందరో కళామతల్లిని నమ్ముకుని జీవితాన్ని అంకితం చేస్తుంటారు. ముఖ్యంగా కథానాయికగా ఎదగాలని ఫిలింనగర్‌లో తిరిగే అమ్మాయిలు ఎందరో. అదే కోవలో ఓ అమ్మాయి నటనారంగంలో స్థిరపడాలని విచ్చేసింది. ముందుగా డ్యాన్సర్‌గా పాపులర్ అయ్యింది. తర్వాత ఓ స్టార్ డైరెక్టర్ కళ్లలో పడింది. ప్రతిభావనికి ప్రోత్సాహం దొరికింది.
కట్ చేస్తే సదరు డ్యాన్సర్ కం మోడల్ కథానాయికగా ప్రమోట్ అయ్యింది. ఆమె పేరు శీయా గౌతమ్. అలా 2008లో నేనింతే చిత్రంలో నాయికగా కనిపించింది. నటనలో ఈజ్ ఉంది. మంచి డ్యాన్సర్.. ఫర్వాలేదనుకున్నారు. కానీ ఎందుకనో విధి వక్రించింది. తొలిసినిమా అట్టర్‌ఫ్లాప్. అవార్డులొచ్చినా పట్టించుకోలేదెవరూ. దాంతో కేవలం చిన్నా చితకా క్యారెక్టర్ల వరకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ సినిమా తర్వాత వేదం (2010) చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. మధ్యలో కొన్ని వాణిజ్య ప్రకటనల్లోనూ మెరిసింది. ఇతర పరిశ్రమలవైపు వెళ్లింది. కానీ ఏం లాభం కెరీర్ అనుకున్నంత స్పీడ్ అందుకోలేదు. ఎంతో వేచి చూసింది. చివరికి ఆ ఎదురు చూపులు ఫలించి ఓ అవకాశం వచ్చింది ఇన్నాళ్టికి.
పిలవని పేరంటం పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో మంచు లక్ష్మితో పాటు ఒక నాయికగా నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా ప్రస్తుతం ఆన్‌సెట్స్ ఉంది. ఎప్పుడు రిలీజవుతుందో తేలాల్సి ఉంది. శీయా భవితవ్యాన్ని మార్చే సినిమా అవుతుందో లేదో రిలీజ్ తర్వాతే తెలిసేది. అందాకా వేచి చూడాల్సిందే.