Begin typing your search above and press return to search.
స్వీటీ ఆఫర్ ఇచ్చింది
By: Tupaki Desk | 21 Nov 2015 5:08 AM GMTసైజ్ జీరో అన్న పేరుకు తగ్గట్టుగానే దాన్నో చిన్న సైజు సినిమాగా తీయాలనుకొన్నాడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్. కానీ ఆ కథ పీవీపీ కాంపౌండ్ లోకి వెళ్లాక రూపురేఖలే మారిపోయాయి. సైజ్ జీరో కాస్త భారీ సైజు సినిమాగా మారిపోయింది. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా తెలుగు - తమిళ భాషల్లో భారీ హంగులతో చిత్రాన్ని నిర్మించింది పీవీపీ సంస్థ. నిర్మాణం మాత్రమే కాదు... దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ పక్కా ప్రణాళికల్ని అమలుచేస్తోంది. ఇప్పటికే సైజ్ జీరో సినిమాని సోలోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకొన్నారు. పీవీపీ తన పలుకుబడినంతా ఉపయోగించి తన సినిమాకి మరో ఏ సినిమా కూడా అడ్డుగా రాకుండా చూసుకొన్నాడు. రేపు శుక్రవారం స్వీటీ సోలోగానే సందడి చేయబోతోందన్నమాట.
రిలీజ్ ఏర్పాట్ల వరకు ఓకే కానీ... ప్రేక్షకులు కూడా ఆ స్థాయిలోనే థియేటర్ లకు కదిలి రావాలి కదా! మరి వస్తారా? ఇదే సందేహం చిత్రవర్గాల్లోనూ తలెత్తిందో ఏంటో పీవీపీ ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించాడు. భారీగా థియేటర్లు దక్కాయి కాబట్టి జనాల్ని కూడా అదే స్థాయిలో ఆకర్షించాలన్న ప్రయత్నంలో భాగంగా... ``మా సినిమాని చూడండి, కేజీ బంగారం గెలుచుకోండి`` అని ప్రకటనలు గుప్పిస్తున్నాడు. ఇలాంటి ఆకర్షణీయ ప్రకటనలు గుప్పించడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఓపెనింగ్స్ ని కోసమే ఈ ప్రయత్నం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి పీవీపీ ఆశయం నెరవేరుతుందో లేదో చూడాలి. అయినా కంటెంట్ బాగున్నప్పుడు ఇలాంటి ఆఫర్లను నమ్ముకోవడం దండగ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.