Begin typing your search above and press return to search.
అనుష్క నయావతార్.. ఇప్పుడిప్పుడే కాదు
By: Tupaki Desk | 20 Sep 2015 11:30 AM GMTటాప్ హీరోయిన్లు సాధారణంగా డీగ్లామర్ రోల్స్ లో కనిపించడానికి అస్సలు ఇష్టపడరు. డిమాండ్ తగ్గాక నటనకు ప్రాధాన్యమున్న పాత్రలంటూ కొంచెం రూటు మార్చడం మామూలే కానీ.. సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ అనిపించుకుంటూ కూడా డీగ్లామర్ రోల్ చేయడమంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అనుష్క మాత్రమే ఆ ఘనత దక్కించుకుంది. ‘సైజ్ జీరో’ అంటూ సరికొత్త అవతారంలో దర్శనమివ్వబోతోంది అనుష్క. ఈ సినిమా కోసం ఈ బెంగళూరు బ్యూటీ నిజంగానే లావెక్కడం.. సన్నబడటం విశేషం. అనుష్కను ఇలా చూడ్డానికి ముందు కొంచెం ఎబ్బెట్టుగానే అనిపించినా.. తర్వాత తర్వాత జనాలు బాగానే అలవాటు పడ్డారు.
ముందుగా అనుకున్న ప్రకారమైతే ‘సైజ్ జీరో’ను అక్టోబరు2న విడుదల చేయాలి. అదే రోజు కంచె - శివమ్ సినిమాలున్నప్పటికీ వెనక్కి తగ్గేది లేదన్నట్లు మాట్లాడారు దర్శక నిర్మాతలు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఆ రోజు సినిమాను విడుదల చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని భావించి మనసు మార్చుకున్నారు. ‘సైజ్ జీరో’ ద్విభాషా చిత్రం. తమిళంలో కూడా ఒకేసారి రిలీజ్ చేయాలి. ఐతే అక్టోబరు 1న విజయ్ సినిమా ‘పులి’ కూడా వస్తుండటంతో మరుసటి రోజు తమిళ వెర్షన్ విడుదల చేస్తే పట్టించుకునేవారుండరు. తెలుగులో కూడా పోటీ ఉండటంతో వాయిదా తప్పలేదు. ఐతే ఈ డేటు కాదంటే మళ్లీ అక్టోబరంతా కష్టమే. తర్వాతి మూడు వారాలూ తెలుగులో భారీ సినిమాలు లైన్ లో ఉన్నాయి. కాబట్టి అనుష్క నయా అవతారాన్ని చూడ్డానికి నవంబరు దాకా ఎదురు చూడాల్సిందే.