Begin typing your search above and press return to search.
'ఖుషి' డైరెక్టర్ అందుకే పెళ్లి చేసుకోలేదట!
By: Tupaki Desk | 29 April 2021 3:30 AM GMTపవన్ కల్యాణ్ హీరోగా చేసిన సినిమాల్లో 'ఖుషి'కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమా పవన్ క్రేజ్ ను .. ఆయన మార్కెట్ ను అమాంతంగా పెంచింది. పవన్ సరసన నాయికగా భూమిక నటించిన ఈ సినిమాకి ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని మాటలను .. పాటలను ఇప్పటికీ జనం ఇష్టపడతారు. నిన్నటితో ఈ సినిమా 20 ఏళ్లను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించిన విశేషాలను ఎస్.జె. సూర్య పంచుకున్నారు.
పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం .. 'ఖుషి' కథ చెప్పగానే వెంటనే ఆయన ఓకే చెప్పారు. తెలుగులో ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఆ స్థాయి విజయాన్ని మళ్లీ అందుకోలేకపోయినందుకు బాధగానూ ఉంది. 'ఖుషి' కథలో పవన్ చెప్పినట్టుగానే కొన్ని మార్పులు చేర్పులు చేశాను. ఆ సినిమా అంతగా హిట్ కావడానికి కారణం పవన్ కల్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయనకి గల క్రేజ్ ఆ సినిమాను మరింత ముందుకు నడిపించింది. ఈ సినిమా గురించి మళ్లీ ఇంతకాలానికి ఇలా మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది.
చెన్నైలోని ఒక హోటల్లో సర్వర్ గా నా జీవితం మొదలైంది. తెలుగు .. తమిళ భాషల్లో దర్శకుడిగా సినిమాలు చేశాను. ప్రస్తుతం నటుడిగా నా కెరియర్ సాగుతోంది. హీరోగానూ .. విలన్ గాను నటిస్తున్నాను. విలన్ పాత్రలను ఎక్కువగా చేయడం ఇష్టం లేకనే ఈ మధ్య రెమ్యునరేషన్ పెంచేశాను. లైఫ్ లో దర్శకుడిగానూ .. నటుడిగాను నేను అనుకున్న టార్గెట్ ను ఇంకా రీచ్ కాలేదు. అందుకే పెళ్లి చేసుకోలేదు" అని చెప్పుకొచ్చారు.