Begin typing your search above and press return to search.
ఆర్ట్ డైరెక్టర్ పై చెంప దెబ్బ..షూటింగ్ నిలిపివేత!
By: Tupaki Desk | 7 Dec 2022 12:30 PM GMTటాలీవుడ్‌లోని పెద్ద కుటుంబానికి చెందిన ప్రముఖ హీరో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. తాజాగా ఈసినిమా సెట్స్‌లో జరిగిన ఓ సంఘటన షూటింగ్‌కి అంతరాయం కలిగించిందని సమాచారం. ఈ సినిమా కోసం దర్శకుడు కొంత కష్టమైన ఆర్ట్ వర్క్‌ను డిమాండ్ చేయడంతో? దర్శకత్వ శాఖలోని కొంత మంది వ్యక్తులు దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు సమాచారం.
దర్శకుడు పదే పదే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌పై ఒకే రకమైన ఒత్తిడి తీసుకు రావడంతో తిరుగబాటు చేసినట్లు చేసినట్లు వినిపిస్తుంది. రోజువారీ హడావిడిలో దర్శకత్వ శాఖకు చెందిన ఎవరో ఒక ఆర్ట్ డైరెక్టర్ని చెంపదెబ్బ కొట్టారని.. ఇది సెట్స్‌లో పెద్ద గందరగోళానికి దారితీసిందని సమాచారం. ఈ సంఘటన చోటుచేసుకుని వారం రోజులు అవుతోందిట.
అప్పటి నుంచి షూటింగ్ కి అంతరాయం ఏర్పడుతున్నట్లు సమాచారం. రెగ్యులర్ ఎవరి విధుల్లో భాగంగా వారు సెట్స్ కి హాజరవుతున్నా? మునుపటి అంత ఉత్సహాంగా షూటింగ్ వాతావరణం లేకపోవడం... బ్రేక్ ఫాస్ట్..లంచ్ డిన్నర్ సమయాల్లో చెంప దెబ్బ టాపిక్ డిస్కషన్స్ కు రావడం వంటివి జరుగుతున్నాయిట. ఈ సీన్ చోటు చేసుకున్న వెంటనే రెండు వర్గాలు గా టీమ్ విడిపోయి పని చేస్తుందిట.
ఇప్పుడు ఒకరంటే ఒకరికి ఏమాత్రం పొసగడం లేదని...నువ్వెంతంటే? నువ్వెంత అనుకునే స్థాయికి వాతావరణం వెడెక్కినట్లు సమాచారం. ఈ విషయంలో ఎవరూ తల దూర్చడం లేదని సమాచారం. హీరోగారు అయితే అస్సలు పట్టించుకోవడం లేదుట. షూటింగ్ ఉంటే చేసుకుని వెళ్లిపోవడం..క్యాన్సిల్ అయితే ఎంచక్కా..విదేశీ అందాలు ఆస్వాదించే పనిలో నిమగ్నం అవుతున్నారుట.
తాజాగా ఈ సమస్యను పరిష్కరించడానికి నేరుగా నిర్మాత లండన్‌కు వెళ్లారని తెలిసింది. ప్రస్తుతానికి షూటింగ్ యదావిధిగా కొనాసాగించాలని..ఎవైనా సమ్యలుంటే ఇండియాకి వెళ్లిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందామని నిర్మాత చెప్పినా ఆ రెండు వర్గాలు వినడం లేదుట. ఒకరి కొకరు క్షమాపణలు చెప్పడానికి ముందుకు రాకపోవడంతోనే ఈ సన్నివేశం ఎదురైనట్లు కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఘటన నిర్మాతకు కోట్ల రూపాయలు నష్టం తెచ్చేలానే కనిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.