Begin typing your search above and press return to search.
కటౌట్ లేకున్నా కంటెంట్ వుంటే సరిపోద్ది డ్యూడ్!
By: Tupaki Desk | 23 Oct 2022 1:30 AM GMT`కటౌట్ ని చూసి కొన్ని కొన్ని నమ్మెయ్యాలి డ్యూడ్`..`మిర్చి` మూవీతో ప్రభాస్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఈ మధ్య విడుదలవుతున్న కొన్ని సినిమాలు మాత్రం కటౌట్ లేకున్నా కంటెంట్ వుంటే సరిపోద్ది డ్యూడ్! అని నిరూపిస్తున్నాయి. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. గతంలో హీరో స్టార్ డమ్ ని, కటౌట్ ని చూసి జనాలు థియేటర్లకు ఎగబడే వారు. దాంతో స్టార్స్ నటించిన సినిమాలు ఎలా వున్నా సరే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేవి.
అయితే ఇప్పడు ట్రెండ్ మారింది. ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. కటౌట్ వుంటే సరిపోదు కంటెంట్ వుండాలి డ్యూడ్ అంటున్నారు. కటౌట్ లేకున్నా కంటెంట్ వుంటే సరిపోద్ది అంటూ స్టార్స్ నటించిన సినిమాల్లో కావాల్సిన కటౌట్ వున్నా కంటెంట్ లేకపోవడంతో రిర్ధాక్షిణ్యంగా రిసెక్ట్ చేస్తున్నారు. దీంతో చాలా వరకు స్టార్ హీరోలు నటించిన భారీ క్రేజీ ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ లు గా మారి షాకిస్తున్నాయి.
యష్ నటించిన `కేజీఎఫ్ చాప్టర్ 1` తెలుగుతో పాటు దేశ వ్యాప్తంగా ఐదు భాషల్లో సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇందులో నటించిన యష్ కన్నడ ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితుడు.. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ హీరో గురించి తెలిసిన వాళ్లు జీరో.. అయితే కంటెంట్ బలంగా వుండటంతో `కేజీఎఫ్ చాప్టర్ 1` పాన్ ఇండియా మూవీగా దేశ వ్యాప్తంగా ఐదు భాషల్లో సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా అంత వరకు విడుదలైన కన్నడ సినిమాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా రికార్డులు నెలకొల్పింది.
ఈ మూవీ తరువాత విడుదలైన సీక్వెల్ పై మరింత హైప్ క్రియేట్ కావడంతో వసూళ్ల పరంగా సంచలనాలు సృష్టించి కన్నడ సినీ చరిత్రలోనే అత్యథిక వసూళ్లని రాబట్టిన మూవీగా నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే యష్ నటన, బలమైన కంటెంట్ వుండటమే. ఈ మూవీ తరువాత కన్నడ నుంచి విడుదలైన `విక్రాంత్ రోణ`, ఛార్లీ 777 మంచి విజయాన్ని సాధించాయి. ఇక
విడుదలైన `కాంతార` దేశ వ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది.
ఇందులో నటించి, డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి ఎవరో ఎవరికీ తెలియదు. యష్ తరహాలోనే కన్నడలో మాత్రమే తెలిసిన నటుడు. కానీ `కాంతార`తో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారడానికి కారణం కటౌట్ కాదు.. కంటెంట్ ..అదే ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా దేశం మొత్తం చర్చించుకునేలా చేస్తోంది. ఇప్పటికే వంద కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన ఈ మూవీ బాలీవుడ్ లో సరికొత్త చరిత్రని సృష్టించబోతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ మూవీకి ముందు విడుదలైన `కార్తికేయ 2` కూడా నార్త్ లో సంచలనాలు సృష్టించింది. కృష్ణతత్వం నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ లో నిఖిల్ హీరోగా నటించగా, చందూ మొండేటి తెరకెక్కించాడు. దక్షిణాదికి మాత్రమే పరిచయం వున్న నిఖిల్ `కార్తికేయ 2`తో తొలిసారి నార్త్ లో సంచలనాలు సృష్టించడానికి ప్రధాన కారణం కంటెంట్. ఇలా ఇటీవల స్టార్ హీరోలు లేకుండా విడుదలై కంటెంట్ తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ సినిమాల అనూహ్య విజయంతో ప్రేక్షకులు కటౌట్ లేకున్నా కంటెంట్ వుంటే సరిపోద్ది డ్యూడ్ అని నిరూపిస్తున్నారు.
రీసెంట్ గా విడుదలైన `ఆచార్య`లో ఇఇద్దరు స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు. ఇద్దరు స్టార్స్ వున్నా ఈ మూవీ సరైన కంటెంట్ లేక పోవడంతో వారి కెరీర్ లో మర్చిపోలేని డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇలా చాలా వరకు సినిమాలు ఈ మధ్య కటౌట్ వున్నా కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు తిరస్కరించి కంటెంట్ వున్న వాటికే జై కొడతామంటూ సంకేతాల్ని అందించడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.