Begin typing your search above and press return to search.
`గాడ్ ఫాదర్`కి స్మాల్ బ్రేక్
By: Tupaki Desk | 26 Aug 2021 7:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మలయాళ బ్లాక్ బస్టర్ `లూసీఫర్`ని..`గాడ్ ఫాదర్` టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ సాగుతోంది. చిరంజీవి సహా కీలక నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
అయితే అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న నిరవ్ షా మరో సినిమాకు కమిట్ అవ్వడంతోనే అర్థాంతరంగా షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. నిరవ్ షా `గాడ్ ఫాదర్` తో పాటు కోలీవుడ్ లో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వాలిమై చిత్రానికి కూడా పని చేస్తున్నారు.
తళా అజిత్ షూటింగ్ ఫారిన్ లోకేషన్స్ లో జరుగుతోంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి జరగడంతో నిరవ్ కి షూటింగ్ కి హాజరు కాలేకపోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో నాలుగు రోజుల పాటు గాడ్ ఫాదర్ షూటింగ్ వాయిదా పడింది. నీరవ్ ముందుగా అజిత్ సినిమా షూట్ చేయాలని అగ్రిమెంట్ చేసుకోవడంతో గాడ్ ఫాదర్ కి బ్రేక్ పడక తప్పలేదు. పైగా వాలిమై విదేశీ షెడ్యూల్లో ఉండటంతో గాడ్ ఫాదర్ టీమ్ కూడా ఓ అడుగు వెనక్కి తగ్గనట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల్లో అజిత్ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. అనంతరం నిరవ్ పూర్తిగా `గాడ్ ఫాదర్` చిత్రీకరణకు పూర్తి సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం `గాడ్ ఫాదర్` టీమ్ విరామంలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి ఇప్పటికే ఆచార్య షూటింగ్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గాడ్ ఫాదర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఇంకా `వాల్తేరు వీరన్న`..భోళా శంకర చిత్రాల షూటింగ్ లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకే ఏడాది వరుసగా సినిమాలు కమిట్ అవుతూ మెగాస్టార్ పాత రోజుల్ని తలపిస్తున్నారు. బాస్ కి 70 ఏళ్లు పూర్తి అయ్యేలోపు 20 సినిమాలు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం.
మెగా బర్త్ డే రోజున టైటిల్స్ ప్రకటన
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలోని `ఆచార్య` విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన చిరు తదుపరి వరుసగా పవర్ ఫుల్ టైటిల్స్ ని లాక్ చేశారు. ఆగస్టు 22న మెగాస్టార్ వరుసగా టైటిల్స్ ని ప్రకటించారు. ఇందులో గాడ్ ఫాదర్ - భోళా శంకర్ టైటిల్స్ అధికారికం అయ్యాయి. ఇప్పటికే లూసీఫర్ రీమేక్ `గాడ్ ఫాదర్` షూటింగ్ లో చిరు జాయిన్ అయ్యారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి చర్చి ఫాదర్ గా కనిపించనున్నారు. టైటిల్ పాత్రతో చిరంజీవి మెస్మరైజ్ చేయాలన్నది తన ఇమేజ్ ని బట్టి ఎంపిక. అభిమానులకు ఎలాంటి సందేహాల్లేకుండా టైటిల్ ల్లోనే కంటెంట్ ఎలా ఉండబోతుందన్నది ఓ క్లారిటీ దొరికింది. అలాగే తమిళ సినిమా `వేదాళం` రీమేక్ లోనూ చిరంజీవి నటించనున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
మరోవైపు యవ దర్శకుడు బాబి దర్శకత్వంలో ఓ ఫ్యాన్ బేస్డ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి `వాల్తేరు వీరన్న` అనే మాసీ టైటిల్ ని ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారమైంది. వాల్తేరు అనేది విశాఖపట్ణణంలో ఫేమస్ ఏరియా. టైటిల్ ని బట్టి వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు. వీరన్న టైటిల్ పై కొందరు మేధావులు పాత వాసన అంటూ అభ్యంతరం చెప్పడంతో మార్చాలనే ఆలోచన చేస్తున్నారని అందుకే బర్త్ డే రోజున ప్రకటించలేదని కూడా గుసగుసలు వినిపించాయి.