Begin typing your search above and press return to search.
వార్నీ! ఫేక్ టెర్రరిస్టులు ఎంత పని చేశార్రా!
By: Tupaki Desk | 29 May 2019 8:25 AM GMTవార్నీ! జూ.ఆర్టిస్టులు ఎంత పని చేశారు? అని షాక్ తినకుండా ఉండలేరు!! తీవ్రవాదులు బాబోయ్ అంటూ జనం కంగారు పడేంతగా ఆ ఇద్దరూ చేసిన పనికిమాలిన పనిని తిట్టుకోకుండా ఉండలేరు అక్కడ సీను గురించి తెలుసుకున్న తర్వాత. అంతగా ఏం చేశారు? ఎవరా జూనియర్ ఆర్టిస్టులు? అంటారా.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా భారీ యాక్షన్ చిత్రం ఒకటి ముంబైలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ ఇద్దరు జూ.ఆర్టిస్టులు ఏకంగా బాంబర్స్ గెటప్ లో తుపాకులు పట్టుకుని సిగరెట్లు తాగేందుకు సెట్ బయటకు వెళ్లారు. ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఆ గెటప్పుల్లో తిరుగుతూ హల్ చల్ చేశారు. కిరాణా కొట్లకు వెళ్లి సిగరెట్లు తాగారు. అయితే వీళ్ల వాలకం చూసి డౌట్ పడిన సదరు షాపు వాళ్లు .. స్థానికులు పోలీసులకు ఫోన్లు చేయడంతో వెంటనే ఆ స్పాట్ కి వచ్చిన పోలీసులు అనుమానాస్పదంగా తిరగాడిన ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారట. ఈ దెబ్బకు ఏకంగా ఒకరోజంతా షూటింగ్ బ్లాక్ అయ్యింది. చిత్రయూనిట్ తో పాటు నిర్మాతలు ఉసూరుమన్నారు.
ఆ ఇద్దరు తింగరి ఆర్టిస్టులు చేసిన పనికి అందరి పనికి అంతరాయం కలిగింది. చివరికి నిర్మాతలు వాళ్లు తీవ్రవాదులు కాదు మహా ప్రభో! అంటూ ఓ లేఖ రాసి పోలీసులకు ఇచ్చాక కానీ ఆ ఇద్దరినీ వదిలిపెట్టలేదు. అంత రుబాబ్ జరిగిందన్నమాట. ఇప్పుడు చెప్పండి ఎంత పని చేశార్రా బాబూ!! అంటూ ఆ ఇద్దరిపైనా కోపం రావడం లేదూ? షూటింగ్ గెటప్పుల్లో బయటకు వెళ్లడమే గాక తుపాకులు పట్టుకెళ్లారు గడుగ్గాయ్‌లు.. పైగా ఆ గెటప్పుల్లో సిగరెట్లు కాల్చి ఇష్టానుసారం బిహేవ్ చేశారు. అందుకే ఇలా బుక్కయ్యారన్నమాట.