Begin typing your search above and press return to search.
బుల్లి సినిమా.. ఆ స్టార్ హీరోను దెబ్బేసింది
By: Tupaki Desk | 28 March 2022 4:13 AM GMTవిడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి.. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెర తీయటమే కాదు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది కశ్మీర్ ఫైల్స్. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటమే కాదు.. విడుదలైన నాలుగు రోజులకు దేశ వ్యాప్తంగా ఈ సినిమాను ప్రదర్శించే స్క్రీన్ల సంఖ్యను భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 11న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటివరకు 200 కోట్ల రూపాయిలకు పైనే కలెక్షన్లను సాధించినట్లు చెబుతున్నారు. ఈ సినిమాను తప్పనిసరిగా చూడాలన్న ఉద్యమ స్ఫూర్తి ప్రేక్షకుల్లో కనిపించటమే కాదు.. మౌత్ పబ్లిసిటీతో దూసుకెళ్లింది. ఇక.. ఈ సినిమాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని సగటు సినీ అభిమాని సైతం ఫిదా అయిపోవటం తెలిసిందే.
ఈ మూవీని వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా కారణంగా తన సినిమాకు దెబ్బ పడిందంటూ బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ వాపోయారు.
తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్ చక్కటి విజయాన్ని సొంతం చేసుకుందన్న అక్షయ్.. విచిత్రమైన విషయం ఏమంటే.. ఈ సినిమా కారణంగా తాను నటించిన తాజా చిత్రం బచ్చన్ పాండే వసూళ్ల మీద ప్రభావాన్ని చూపినట్లుగా పేర్కొన్నారు. 'కశ్మీర్ ఫైల్స్ మూవీ ఎఫెక్టు నా సినిమా మీద పడింది. నేను నటించిన బచ్చన్ పాండే కలెక్షన్లను కశ్మీర్ ఫైల్స్ దెబ్బ తీసింది' అని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు.
దీనికి సంబంధించిన వీడియోను తాజాగా కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మూవీకి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయింపును ఇస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ సినిమాను త్వరలోనే తెలుగు.. తమిళం.. కన్నడ.. మలయాళ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తారని చెబుతున్నారు.
ఏమైనా.. కశ్మీర్ ఫైల్స్ మూవీ సందడి మరికొంతకాలం కొనసాగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' పుణ్యమా అని హిందీ బెల్ట్ లో కశ్మీర్ ఫైల్స్ కు కాసింత దెబ్బేసినప్పటికి.. పలు థియేటర్లలో కొనసాగుతుండటం గమనార్హం.