Begin typing your search above and press return to search.

బుల్లితెర బేబ్స్ అగ్గిమీద గుగ్గిలం

By:  Tupaki Desk   |   25 Jan 2019 6:29 AM GMT
బుల్లితెర బేబ్స్ అగ్గిమీద గుగ్గిలం
X
బుల్లితెర నుంచి పెద్ద తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు కొందరు భామ‌లు. అక్క‌డ అగ్ర క‌థానాయ‌కుల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుని ఆరంభ‌మే క్రేజు తెచ్చుకుంటున్నారు. అటుపై సౌత్ లోనూ స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ కోవ‌లో ప‌రిశీలిస్తే ఇప్ప‌టికే `హేట్ స్టోరి` 4 బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా - `గోల్డ్` ఫేం మౌని రాయ్ వంటి భామ‌లు బుల్లితెర నుంచి పెద్ద తెర‌కు వ‌చ్చి విజ‌యాలు అందుకున్నారు. ప్ర‌స్తుతం ఈ భామ‌లిద్ద‌రూ సౌత్ పై క‌న్నేశారు. ఇటీవ‌లే కెజిఎఫ్ చిత్రంలో మౌనిరాయ్ స్పెష‌ల్ నంబ‌ర్ యూత్ కి కిక్కెక్కించింది. ఊర్వ‌శి రౌతేలాకు సౌత్ నుంచి ఆఫ‌ర్లు ఉన్నాయ‌న్న టాక్ వినిపిస్తోంది.

ఇక టీవీ నాయిక‌లంతా సామాజిక మాధ్య‌మాల్లో నిరంత‌రం యాక్టివ్ గా ఉంటూ అభిమానుల‌కు ట్రీట్ ఇవ్వ‌డం వెన‌క చాలానే బిజినెస్ స్ట్రాట‌జీ ఉంటుందిట‌. ఓవైపు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో అవ‌కాశం మ‌రోవైపు సౌత్ నుంచి ఆఫ‌ర్ల వెల్లువ ఇలానే సాధ్య‌మ‌వుతోందిట‌. టీవీ నుంచి పెద్ద తెర క‌ల‌లు కంటున్న భామ‌ల్లో షామా శికంద‌ర్ - క‌విత కౌశిక్ - శ్వేత తివారీ - రాగిణి ఖ‌న్నా - జెన్నిఫ‌ర్ గ్రోవ‌ర్ - క్రితిక క‌మ్రా - మ‌హి విజ్ - క‌రిష్మా త‌న్నా వంటి భామ‌లు ఉన్నారు. వీళ్లంతా సోష‌ల్ మీడియాలో అల్ట్రా యాక్టివ్.

ప్ర‌స్తుతం ఈ యంగ్ బ్యూటీస్ హాట్ ఫోజులు యూత్ లో వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి. కొంద‌రు బికినీల్లో ఫోజులిస్తూ వేడి పెంచుతున్నారు. పెద్ద తెర క‌ల‌ల్ని నెర‌వేర్చుకునేందుకు పెద్ద రేంజులోనే ఈ బ్యూటీస్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ అంద‌గ‌త్తెల్లో షామా శికంద‌ర్ ఇప్ప‌టికే వేడెక్కించే బికినీ ఫోజుల‌తో హాట్ టాపిక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.