Begin typing your search above and press return to search.

స‌మంత‌పై చిన్మ‌యి షాకింగ్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   4 Sep 2022 2:30 AM GMT
స‌మంత‌పై చిన్మ‌యి షాకింగ్ కామెంట్స్‌!
X
స్టార్ హీరోయిన్ స‌మంత తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. త‌న జ‌ర్నీ వెన‌క ప్రముఖ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీ‌పాద కూడా వున్నారు. త‌న గాత్రం వ‌ల్లే స‌మంత హీరోయిన్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇదే స్థాయిలో గాయ‌ని చిన్మ‌యి కూడా గాయ‌నిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరుతో పాటు పాపులారిటీని ద‌క్కించుకుంది. ఈ జ‌ర్నీలో ఈ ఇద్ద‌రు మంచి స్నేహితుల‌య్యారు. గ‌త కొన్నేళ్లుగా వీరి స్నేహ బంధం నిరాటంకంగా కొన‌సాగుతూనే వుంది.

అయితే తాజాగా ఈ జ‌ర్నీకి బ్రేక్ ప‌డింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్త‌ల‌పై చిన్మ‌యి షాకింగ్ కామెంట్ లు చేసింది. ఓ మీడియాకు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో స‌మంత‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చిన్మ‌యి త‌న‌తో ప్ర‌యాణం ముగిసింద‌ని స్ప‌ష్టం చేసింద‌ని తెలిసింది. స‌మంత త‌న‌కు మంచి ఫ్రెండ్ అని, ఈ మిద్ద‌రం త‌ర‌చూ క‌లుస్తుంటామ‌ని తెలిపిన చిన్మ‌యి మా ఇద్ద‌రికి సంబంధించిన అన్ని విష‌యాల్ని అంద‌రికి వెల్ల‌డించాల్సిన అవ‌స‌నం లేద‌ని స్ప‌ష్టం చేసిందట‌.

సోష‌ల్ మీడియాలో మేమిద్ద‌రం క‌లిసి వున్న ఫొటోలు షేర్ చేయనంత మాత్రాన సామ్ తో నేను విడిపోయిన‌ట్టు కాద‌ని, వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని తెలిపింది. ప‌ర్స‌న‌ల్ లైఫ్ ని అంద‌రితో షేర్ చేసుకోవ‌డం మా ఇద్ద‌రికి న‌చ్చ‌ద‌ని, అందుకే మేం క‌లిసినా ఆ విష‌యాన్ని ఎవ‌రికీ చెప్ప‌మ‌ని తెలిపింది. నా భ‌ర్త రాహుల్, నేను, సామ్ మంచి స్నేహితులం. క‌ల‌వాల‌నుకుంటే మా ఇంట్లోనే క‌లుస్తాం` అని చిన్మ‌యి తెలిపింద‌ట‌.

స‌మంత వ‌ల్లే త‌న కెరీర్ ఊపందుకుంద‌ని చెప్పిన చిన్మ‌యి తెలుగు, త‌మిళ భాష‌ల్లో డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నానంది. అయితే ఇక‌పై త‌న‌తో డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రం త‌న ప్ర‌యాణం ముగిసింద‌ని తెలిపింది. ఉన్న‌ట్టుండి స‌మంత‌కు చిన్మ‌యి డ‌బ్బింగ్ చెప్ప‌డం మానేయ‌డానికి కార‌ణం గ‌త కొంత కాలంగా స‌మంత త‌న పాత్ర‌ల‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటోంది. ఆ కార‌ణం వ‌ల్లే చిన్మ‌యి తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా చెబుతున్నారు.

ఎందుకంటే ఇప్పుడు సమంత తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటుందని.. ఇక ఆమెకి డబ్బింగ్ చెప్పే అవకాశం రాదేమోనని చెప్పుకొచ్చారు. ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయా..? అని చిన్మయిని ప్రశ్నించగా.. 'మేమిద్దరం కలిసినప్పుడు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టనంత మాత్రాన మేం విడిపోయినట్లు కాదు. నా పర్సనల్ లైఫ్ ని అందరితో షేర్ చేసుకోవడం నాకు నచ్చదు. అందుకే మేం కలిసిన విషయాన్ని ఎవరికీ చెప్పం. మేమిద్దరం మీట్ అవ్వాలనుకుంటే ఇంట్లోనే కలుస్తుంటాం. నా భర్త రాహుల్, సామ్ మంచి ఫ్రెండ్స్' అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా వుంటే ప్ర‌స్తుతం స‌మంత శాకుంత‌లం, య‌శోద, ఖుషీ చిత్రాల్లో న‌టిస్తోంది. త్వ‌ర‌లో రాజ్ ఎన్ డీకే రూపొందించ‌నున్న వెబ్ సిరీస్ లోనూ న‌టించ‌బోతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.