Begin typing your search above and press return to search.

కావేరీ కాలింగ్ ఉద్య‌మంలో పాప్ స్మిత‌

By:  Tupaki Desk   |   17 Sep 2019 1:30 AM GMT
కావేరీ కాలింగ్ ఉద్య‌మంలో పాప్ స్మిత‌
X
భారతదేశంలో ప్రధానమైన నదుల్లో కావేరి ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. దీని జన్మస్థానం కర్ణాటక పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలకావేరి అనే ప్రదేశం. ఈ నదినే దక్షిణ గంగ అని కూడా వ్యవహరిస్తారు. కావేరి నదిలోని నీరు ముఖ్యంగా వ్యవసాయానికి, గృహావసరాలకు.. విద్యుదుత్పత్తికీ ఉపయోగిస్తారు. నదిలోకి నీరు ఋతుపవనాల కారణంగా కలిగే వర్షాలవల్లనే లభిస్తుంది. ఈ నదిపై నిర్మించిన కృష్ణ రాజ సాగర్ డ్యామ్.. మెట్టూర్ డ్యామ్ మొదలైనవి ఋతుపవనాల సమయంలో నీరు నిల్వచేసి వర్షాభావ పరిస్థితుల్లో విడుదల చేస్తుంటారు.

బ్రహ్మగిరి కొండల్లో నెలకొని ఉన్న ఈ నది జన్మస్థానమైన తలకావేరి ఒక సుప్రసిద్ధ యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచింది. వేలాది మంది భక్తులు ఇక్కడ గల మూడు దేవాలయాలను సందర్శిస్తారు. చందనం అడవుల‌కు ప్ర‌సిద్ధి ఈ న‌దీతీరం. ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకొనే కూర్గ్ ఈ నదీమతల్లి వరప్రసాదమే. టిప్పు సుల్తాన్ రాజధానియైన శ్రీరంగ పట్టణం ఈనది ఒడ్డునే ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రములు శ్రీరంగం.. కుంభకోణం ఈనది ఒడ్డునే నెలకొని ఉన్నాయి.. బృందావన్ గార్దెన్స్ ఈ నది వొడ్దు న ఉన్నాయి. ఈ నదీ జలాల వినియోగ విషయంలో కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొని ఉంది. తమిళనాడు రాష్ట్రం చాలాకాలంగా ఈ నదీ జలాలను విస్తారంగా వాడుకోవ‌డాన్ని కర్ణాటక చారిత్రక తప్పిదంగా భావిస్తోంది. ఈ గొడ‌వ ఇలా ఉండ‌గానే కావేరీ జలాలు అడుగంటిపోవ‌డం చెన్న‌య్ స‌హా చాలా న‌గ‌రాల‌కు నీటి కొర‌త ఏర్ప‌డ‌డం తెలిసిందే.

కావేరీ మ‌నుగ‌డ కోల్పోతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ప‌లువురు కోలీవుడ్ సెల‌బ్రిటీలు సామాజిక మాధ్య‌మాల్లో `కావేరీ కాలింగ్` పేరుతో ఉద్య‌మం చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంఘీభావంగా ఇటు టాలీవుడ్ స్టార్లు స్పందిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ కావేరీ నది పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటాలని సంకల్పించారు. ఆయనకు సమంత మద్దతు పలికారు. http://samantha.cauverycalling.org వెబ్ సైట్‌లో విరాళాలు అందించ‌మ‌ని కోరారు. మీరు నేను కలిస్తే..లక్ష మొక్కలని నాటేందుకు సహకరించగలం అంటూ సమంత పోస్టు చేశారు. రూ. 42 విరాళం అందిస్తే..ఒక మొక్కను నాటే వారవుతారని సమంత తెలిపారు.

తాజాగా పాప్ సింగ‌ర్ స్మిత‌- లిరిసిస్ట్ అనంత శ్రీ‌రామ్ ఓ చ‌క్క‌ని ప్ర‌య‌త్నం చేశారు. కావేరీ ప్రాస‌స్థ్యాన్ని స్ప‌ర్శిస్తూ అనంత శ్రీ‌రామ్ అందించిన లిరిక్ తో స్మిత అద్భుత‌మైన పాట‌ను పాడారు. కావేరీ జ‌లాల ప‌రిస్థితి నేడు ఎంత ద‌య‌నీయంగా ఉందో .. ఈ న‌ది ప్ర‌వ‌హించే పరీవాహ‌క ప్రాంతం చెత్తా చెదారంతో ఎంత దారుణంగా త‌యారైందో విజువ‌ల్స్ లో ఆవిష్క‌రించ‌డం ఇంట్రెస్టింగ్. కావేరి పిలుస్తోంది క‌ద‌లిరా.. ! అంటూ సాగే ఈ గీతం యూట్యూబ్ లో దూసుకెళుతోంది. ఎం.జీ గోక‌రి సంగీతం అందించారు.