Begin typing your search above and press return to search.
ఆమెను స్పెషల్ లేడీ అన్న మెగాస్టార్!
By: Tupaki Desk | 18 Oct 2016 1:43 PM GMTబాలీవుడ్ లో చెప్పుకోదగ్గ అలనాటి టాప్ హీరోయిన్స్ లో స్మితా పాటిల్ ది ప్రత్యేక స్థానం. ఈ అలనాటి బాలీవుడ్ నటి స్మితా పాటిల్ ను "స్పెషల్ లేడీ" అంటూ కితాబిచ్చారు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. స్మితా పాటిల్ 61వ జయంతి సందర్భంగా అమితాబ్ ఆమెను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా... స్మితాతో కలసి శక్తి - నమక్ హలల్ సినిమాల్లో నటించానని అమితాబ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్మితాపై స్పందించిన అమితాబ్... స్మితా ఒక ప్రత్యేక మైన మహిళ (స్పెషల్ లేడీ) - వివేకవంతమైన స్నేహితురాలు అంటూ ట్వీట్ చేశారు.
అయితే 1980ల్లో స్మితా పాటిల్ బాలీవుడ్ లో అగ్రశ్రేణి నటిగా వెలుగొందారు. మంతన్ - ఆక్రోశ్ - చక్ర - భూమిక - చిదంబరం - మిర్చ్ మసాలా వంటి పలు హిట్ సినిమాల్లో ఆమె నటించారు. బాలీవుడ్ నటుడు - రాజకీయ నాయకుడు రాజ్ బబ్చర్ ను వివాహం చేసుకున్నారు స్మిత. కాగా స్మితా పాటిల్ మహారాష్ట్రలో అక్టోబర్ 17 - 1955 జన్మించారు. ఈమె హిందీ - మరాఠి కలిపి మొత్తం 80 చిత్రాలలో నటించారు. ఈమె రెండు సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డులు ఒకసారి ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకుంది. ఇదే క్రమంలో దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ ని కూడా ఆమె అందుకున్నారు. ఆమె చైల్డ్ బర్త్ సమస్య వల్ల 31 సంవత్సరాలకే డిసెంబరు 13 - 1986 లో చనిపోయారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/