Begin typing your search above and press return to search.
బాల్ థాకరే సినిమా టైటిల్ ఇదే
By: Tupaki Desk | 17 Aug 2015 12:49 PM GMTబాల్ థాకరే ఈ పేరు దేశ ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినవసరం లేదు. కార్టునిస్టుగా కేరీర్ స్టార్ట్ చేసి శివసేన పార్టీ స్థాపించి ముంబై మరాఠీ లదే అన్న నినాదంతో మహారాష్ర్ట ప్రజల గుండెల్లో చిరకాల హీరోగా నిలిచిపోయారు. త్వరలో ఈ మరాఠా యోధుడి జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతం కానుంది.
బాల్ థాకరే లైఫ్ హిస్టరీని సినిమా తీయాలని ఆయన కోడలు స్మిత థాకరే నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పలు సినిమాలు తీసిన అనుభవం ఉన్న ఆమె తన మామ జీవిత చరిత్రను సినిమాగా తీసేందుకు కసరత్తులు ప్రారంభించారు. స్మిత కుమారుడు రాహుల్ కెనడాలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో పలు కోర్సులో శిక్షణ పూర్తి చేసుకుని వచ్చాడు. పీకే సినిమాకు సహాయకుడిగా పనిచేసిన రాహుల్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.
" సాహెబ్ " అనే టైటిల్ తో బాల్ థాకరే జీవితాన్ని సినిమాగా తెరకెక్కించి భావితరాల ప్రజల గుండెల్లో ఆయన చిరకాలం ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు స్మిత తెలిపారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించి 2017 జనవరి 23న ఆయన జయంతి రోజు సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆమె తెలిపారు.
బాల్ థాకరే గా ఎవరు నటిస్తారు...ఆయన కుమారుల పాత్రల్లో ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. థాకరే క్యారెక్టర్ కు డైలాగ్స్ బాగా చెప్పే హీరోను ఎంపిక చేయాలని ఆయన ఫ్యామిలీ సభ్యులతో స్మిత చర్చలు జరుపుతోందట.