Begin typing your search above and press return to search.
‘బాహుబలి’ని వాడుకుంటే మిలియన్ వ్యూస్
By: Tupaki Desk | 11 March 2016 1:30 PM GMTబాహుబలి అని కనిపిస్తే చాలు.. తెలుగు-తమిళం.. సౌత్-నార్త్.. అని తేడా లేకుండా అందరూ ఓ లుక్ వేసేస్తారు. అలాంటి ఫినామినా క్రియేట్ చేసింది జక్కన్న విజువల్ వండర్. ఈ క్రేజ్ ను ఎవరి స్థాయిలో వాళ్లు ఎలా కావాలంటే అలా వాడేసుకున్నారు. పాప్ సింగర్ స్మిత సైతం ‘బాహుబలి’ క్రేజ్ ను వాడుకుని తన పాటలకు మళ్లీ క్రేజ్ తెచ్చుకుంది. బాహుబలి సినిమాలో బాగా ఫేమస్ అయిన ‘కిలికి’ లాంగ్వేజ్ ఆధారంగా ‘బాహ కిలికి’ పేరుతో స్మిత ఓ పాట రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ సాంగ్ పెద్ద హిట్టవడంతో ఆ కోవలోనే ఇంకొన్ని పాటలు రిలీజ్ చేసింది స్మిత. వీటికి యూట్యూబ్ లో అద్భుతమైన స్పందన వచ్చింది.
బాహ కిలికి ఆల్బంకు యూట్యూబ్ లో ఏకంగా మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఈ ఊపులో ఇంకో నాలుగైదు పాటలు కంపోజ్ చేసి రిలీజ్ చేయాలని చూస్తోంది స్మిత. మామూలు పాటలతో పోలిస్తే ‘బాహ కిలికి’ పాటలు డిఫరెంటుగా ఉండటంతో జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాటి వీడియోస్ కూడా వైవిధ్యంగా ఉంటున్నాయి. ఒకప్పుడు హాయ్ రబ్బా పాటతో దేశవ్యాప్తంగా భారీగా అభిమానుల్ని సంపాదించుకుంది స్మిత. ఆ తర్వాత కూడా రెండు మూడు ఆల్బమ్స్ అలరించాయి కానీ.. తర్వాత తర్వాత ఆమె పాటల్ని పట్టించుకునేవాళ్లు కరవయ్యారు. ఇలాంటి టైంలో ‘బాహుబలి’ పుణ్యమా అని మళ్లీ తన పాటలకు క్రేజ్ వచ్చేలా చేసుకుంది స్మిత.